ఆర్సీబీలో గోల్డెన్ లెగ్- అతని వల్లే ఇదంతా
ఈ ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) దుమ్ము దులిపింది. వరుసగా రెండో ఏడాది కూడా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఆదివారం సాయంత్రం హిమాచల్ ప్రదేశ్ ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించింది. 23 పరుగుల తేడాతో టైటిల్ హాట్ ఫేవరెట్ గా సీజన్ ఆరంభించిన పంజాబ్ కింగ్స్ ను మట్టికరిపించింది. తిరుగులేని విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో టేబుల్ టాపర్ గా ఎదగడమే కాకుండా ప్లేఆఫ్స్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటంగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 222 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ మెరుపులు మెరిపించాడు. తొలుత బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ 20 ఓవర్లల్లో నాలుగు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. బెంగళూరు ఇన్నింగ్ లో జాకబ్ బేథల్ మినహా మిగిలిన బ్యాటర్లందరూ సత్తా చాటారు. వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, చివర్లో టిమ్ డేవిడ్ ధాటిగా ఆడటం బ్యాటింగ్ సైడ్ హైలైట్స్.

విరాట్ కోహ్లీ ఈ సీజన్ లో అయిదోసారి హాఫ్ సెంచరీ బాదాడు. 37 బంతుల్లో మూడు భారీ సిక్సర్లు, నాలుగుఫోర్లతో 58 పరుగులు సాధించాడు. దేవదత్ పడిక్కల్ 25 బంతుల్లోనే మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 45, టిమ్ డేవిడ్ 12 బంతుల్లో రెండేసి చొప్పున ఫోర్లు, సిక్సర్లతో 28 పరుగులు కొట్టారు.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ ప్రారంభంలోనే వికెట్లను కోల్పోయింది. 19 పరుగులకే మూడు వికెట్లను నష్టపోయింది. ఆ తర్వాత కూడా వికెట్ల పతనం కొనసాగింది. ఎక్కడ కూడా భారీ భాగస్వామ్యం నమోదు కాలేదు. అదే ఈ జట్టు పరాజయానికి కారణమైంది. శశాంక్ సింగ్- 56, కూపర్ కొనొలి- 37, సుయాంష్ షెడ్జె- 35, మార్కస్ స్టొయినిస్- 37 ధాటిగా ఆడినా ఫలితం లేకుండా పోయింది. పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 199 పరుగులు చేసి ఓటమిపాలైంది.
ఆర్‌సీబీ బౌలర్లలో రసిక్ సలామ్ (3/36) మూడు వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్(2/38) రెండు వికెట్లు పడగొట్టాడు. జోష్ హాజెల్ వుడ్, సుయాష్ శర్మ, రొమారియోషెపెర్డ్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్ లో గ్రాండ్ ఇచ్చింది. మొదటి జట్టుగా నిలిచింది. ఎటువంటి నెట్ రన్ రేట్ శషభిషలు లేకుండా నేరుగా ప్లేఆఫ్స్ చేరిందీ జట్టు. గట్టిగా ఇంకో మూడు మ్యాచ్ లు ఆడితే ఈ ఏడాది కూడా ఛాంపియన్ గా నిలవడం ఖాయం.
ఈ క్రెడిట్ మొత్తం కూడా ఆర్సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ కు దక్కుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. జట్టు వరుస విజయాల్లో ఆయన పాత్ర కీలకం. విస్మరించలేనిది కూడా. ఆయన జట్టుతో ఉంటే మినిమం ప్లేఆఫ్స్ గ్యారంటీ అవుతోంది. గత రికార్డులు కూడా దీన్ని రుజువు చేస్తోన్నాయి. 2022, 2023 సీజన్ లల్లో లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్ గా వ్యవహరించారు ఆండీ ఫ్లవర్. ఆ రెండు సీజన్ లల్లో కూడా ఆ జట్టు ఎలిమిటర్ వరకూ వచ్చింది.
2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మారారు. ఆ ఏడాది ఆర్సీబీ ఎలిమినేటర్ ఆడింది. ఆ మరుసటి ఏడాదే అంటే 2025లో ఛాంపియన్ గా ఆవిర్భవించింది. 18 సంవత్సరాల తర్వాత కప్ ను ముద్దాడింది. ఈ సీజన్ లో కూడా ఆర్సీబీ ప్లేఆఫ్స్ కు క్వాలిఫై అయింది. మొత్తంగా హెడ్ కోచ్ గా ఆండీ ఫ్లవర్ వరుసగా ఆరు సంవత్సరాలు ప్లేఆఫ్స్ లో అడుగు పెట్టినట్టయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications