న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్యాటింగ్ అంటే బ్రెట్ ‌లీ భ‌య‌ప‌డేవాడు.. ఇక అక్త‌ర్ అంటే.. !!

He was quite a terror on the field himself: Shoaib Akhtar on Brett Lee

కరాచీ: షోయ‌బ్ అక్త‌ర్, బ్రెట్ లీ ఇద్ద‌రు ఫాస్ట్ బౌల‌ర్లు. గంట‌కు 160 కిలోమీట‌ర్ల వేగంతో బంతులు వేసి ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను హడలెత్తించేవారు. ఇద్దరు వారి జ‌న‌రేష‌న్‌లో ఎవ‌రికి వారే సాటి. అక్త‌ర్, లీ కేవలం బౌలింగ్ చేయడం మాత్రమే కాదు.. అప్పుడప్పుడు బ్యాటింగ్‌లో కూడా చెలెగేవారు. అయితే బ్యాటింగ్ చేసేట‌ప్పుడు మాత్రం బ్రెట్ ‌లీ ప్ర‌తీ బౌల‌ర్‌కు భ‌య‌ప‌డేవాడ‌ని అక్తర్ పేర్కొన్నాడు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా బ్రెట్‌ లీ పాల్గొన్న ఇండియ‌న్ టెలివిజ‌న్ షో (కపిల్ శర్మ) వీడియో ఒక‌టి త‌న ట్విట‌ర్‌లో షేర్ చేశాడు.

చిరిగిపోయిన షూ వేలం.. పీఎం-కేర్స్ నిధికి రూ.3.3 లక్షల విరాళం!!చిరిగిపోయిన షూ వేలం.. పీఎం-కేర్స్ నిధికి రూ.3.3 లక్షల విరాళం!!

ప్ర‌తీ ఒక్క బౌల‌ర్‌కు భ‌య‌పడుతా:

ప్ర‌తీ ఒక్క బౌల‌ర్‌కు భ‌య‌పడుతా:

టెలివిజ‌న్ షోలో బ్రెట్‌ లీ త‌న అనుభ‌వాల‌ను వివ‌రించాడు. ఏ బౌలర్‌కు మీరు బయపడుతారు అని హోస్ట్ అడగ్గా.. అందరికి అని లీ సమాధానం ఇస్తాడు. ఇక షోయ‌బ్ అక్త‌ర్‌ బౌలింగ్‌ను ఏ విధంగా ఎదుర్కొన్నాడ‌నేది కూడా చెప్పుకొచ్చాడు. 'నేను బ్యాటింగ్‌ చేసేటప్పుడు ప్ర‌తీ ఒక్క బౌల‌ర్‌కు భ‌య‌ప‌డేవాడిని. ముఖ్యంగా స్పిన్న‌ర్ల‌కు కూడా. ఇక షోయ‌బ్ అక్త‌ర్ బౌలింగ్‌కు కూడా భ‌య‌ప‌డేవాడిని. అత‌డు బౌలింగ్ చేస్తుంటే.. న‌న్ను చంప‌డానికే బౌలింగ్ వేస్తున్నాడేమోన‌ని అనిపించేది' అని బ్రెట్‌ లీ తెలిపాడు.

చంప‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్లుగా అనిపించింది:

చంప‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్లుగా అనిపించింది:

'నా ముద్దు పేరు బింగా. ఒక‌సారి నేను బ్యాటింగ్ చేస్తుంటే బింగా.. బింగా.. అంటూ అరుస్తున్న శ‌బ్ధం విన‌ప‌డింది. బౌలింగ్ ఎండ్ వైపు చూస్తే.. 75 మీటర్ల దూరంలో అక్త‌ర్ ఉన్నాడు. అత‌ని తీరు చూస్తే నన్ను చంప‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్లుగా అనిపించింది.‌ అక్త‌ర్ నా త‌ల‌ను టార్గెట్ చేసి బౌలింగ్ చేస్తాడేమో అనుకున్నా. కానీ ఆ బాల్ నా టోస్‌ను తాక్కుంటూ వెళ్లింది. అంతే నేను అది ఔటేమోన‌ని భావించి అంపైర్ వైపు చూశా. కానీ మా ఆస్ట్రేలియ‌న్ అంపైర్ నాటౌట్‌గా ప్ర‌క‌టించాడు' అని బ్రెట్ ‌లీ చెప్పుకొచ్చాడు.

 లీ బ్యాట్స్‌మెన్‌గా ఎంత భ‌య‌పడ్డాడో:

లీ బ్యాట్స్‌మెన్‌గా ఎంత భ‌య‌పడ్డాడో:

ఈ ఒక్క వీడియో చాలు బ్రెట్‌ లీ త‌న మాట‌ల ప‌ట్ల ఎంత నిజాయితీగా ఉంటాడో చెప్ప‌డానికి. మా జ‌న‌రేష‌న్‌లో బ్రెట్‌లీ ఒక‌ బ్యాట్స్‌మెన్‌గా ఎంత భ‌య‌పడ్డాడ‌‌నేది స్ప‌ష్టంగా క‌నిపిస్తుందంటూ అక్త‌ర్ పేర్కొన్నాడు. అయితే బ్రెట్‌ లీ మైదానంలో బ్యాట్స్‌మన్‌లను భయబ్రాంతులకు గురిచేసేవాడు అని అక్త‌ర్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. లీ ఆసీస్ త‌ర‌పున 76 టెస్టుల్లో 310 వికెట్లు, 221 వ‌న్డేల్లో 380 వికెట్లు తీశాడు. ఇక అక్తర్‌ పాక్‌ తరపున 46 టెస్టుల్లో 176 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు పడగొట్టాడు.

అక్రమ్‌ని చంపేసేవాడిని:

అక్రమ్‌ని చంపేసేవాడిని:

'1990 నుంచి మ్యాచ్‌లు చూసేవాడ్ని. ఎన్నో మ్యాచ్‌ల్లో వసీం అక్రమ్ తన అద్భుత ప్రదర్శనతో పాకిస్థాన్ జట్టుని గెలిపించడం నేను చూశాను. ఒకవేళ అక్రమ్​ నన్ను మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలని అడిగి ఉంటే.. అతడి కచ్చితంగా నాశనం చేసేవాడిని. చంపేందుకు కూడా వెనుకాడేవాడిని కాదు. అయితే అక్రమ్ నా వద్ద ఫిక్సింగ్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు' అని అక్తర్ వెల్లడించాడు.

Story first published: Wednesday, April 22, 2020, 13:02 [IST]
Other articles published on Apr 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X