Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsBAN: సిరాజ్ సలహాను మరీ సీరియస్‌గా తీసుకున్నాడు.. బంగ్లా బ్యాటర్‌పై పేలుతున్న మీమ్స్

 He took Siraj advice a little too seriously memes go viral

భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయ సాధించాలని బంగ్లాదేశ్ పట్టుదలగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా యువ పేసర్ మహమ్మద్ సిరాజ్, బంగ్లా బ్యాటర్ లిటాన్ దాస్ మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వైరం అభిమానుల్లో కూడా మరింత ఊపు తెచ్చింది.

అసలేం జరిగిందంటే?

తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేస్తోంది. అప్పుడు సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. క్రీజులో ఉన్న లిటాన్ దాస్.. సిరాజ్ వేసిన బంతిని ఆడాడు. అది చూసిన సిరాజ్ ఏదో అన్నాడు. అతను అన్న మాటలకు సీరియస్ అయిపోయిన లిటాన్ దాస్.. 'ఏమంటున్నావ్? వినిపించట్లేదు మళ్లీ చెప్పు' అన్నట్లుగా చెవి దగ్గర చెయ్యి పెట్టుకొని వెటకారం ఆడాడు.

అయితే ఆ మరుసటి బంతికే సిరాజ్ అతన్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. అప్పుడు కోహ్లీ, సిరాజ్ కలిసి దాస్‌కు అదే రీతిలో చెవి దగ్గర చెయ్యి పెట్టుకొని సెండాఫ్ ఇచ్చారు. దీని గురించి మాట్లాడిన సిరాజ్.. 'నేను లిటాన్ దాస్‌ను ఏమీ అనలేదు. ఇదేం టీ20 క్రికెట్ కాదు. టెస్టు మ్యాచ్.. కాబట్టి సెన్సిబిల్ క్రికెట్ ఆడు అని చెప్పానంతే' అని వెల్లడించాడు.

ఓపెనర్ల హాఫ్ సెంచరీలు..

ఓపెనర్ల హాఫ్ సెంచరీలు..

రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాకు మంచి ఓపెనింగ్ లభించింది. మూడో రోజు ఆటను 42/0తో ముగించిన బంగ్లా ఓపెనర్లు.. నాలుగో రోజున హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. దీంతో బంగ్లా జట్టు నెమ్మదిగా లక్ష్యం దిశగా సాగుతున్నట్లే కనిపించింది.

టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ ఎంతమంది బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది. అయితే ఎట్టకేలకు 47వ ఓవర్ తొలి బంతికి నజ్ముల్ షాంటో (67)ను ఉమేష్ యాదవ్ పెవిలియ్ చేర్చాడు .ఆ తర్వాత కాసేపటికే అక్షర్ పటేల్ బౌలింగ్‌లో యాసిర్ అలీ (5) కూడా అవుటయ్యాడు. దీంతో వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయిన బంగ్లా జట్టు కష్టాల్లో పడింది.

గోడలా నిలబడిన దాస్..

గోడలా నిలబడిన దాస్..

యాసిర్ అలీ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన బంగ్లా స్టార్ బ్యాటర్ లిటాన్ దాస్.. చాలా నెమ్మదిగా ఆడుతున్నాడు. కేవలం వికెట్ కాపాడుకోవడమే లక్ష్యంగా ఆడాడు. ఒకానొక సందర్భంలో 34 బంతులు ఎదుర్కొన్న అతను కేవలం 3 పరుగులే చేశాడు. ఇది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ ఇచ్చిన సలహాను లిటాన్ దాస్ మరీ సీరియస్‌గా తీసుకున్నాడని, ఇంత నిదానంగా ఆడుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు. అయితే దాస్ ఆటతీరు చూసిన ఎవరికైనా ఇదే అనుమానం రావడం మాత్రం సహజం.

Story first published: Saturday, December 17, 2022, 13:36 [IST]
Other articles published on Dec 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+