షోయాబ్ మాలిక్.. నా మాట విని రిటైర్మెంట్ ఇచ్చేయ్.. నిన్ను పీసీబీ అస్సలు దేకట్లే : పాక్ మాజీ ప్లేయర్ హఫీజ్

షోయబ్ మాలిక్ పట్ల పీసీబీ వ్యవహరిస్తున్న తీరు పట్ల పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఆసియా కప్ 2022 టోర్నీకి షోయాబ్ మాలిక్‌ను పీసీబీ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేయలేదు. 40ఏళ్ల మాలిక్ ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20ప్రపంచకప్ జట్టుకు కూడా సెలెక్ట్ కాలేదు.
అతను రెండు దశాబ్దాలకు పైగా పాకిస్థాన్ తరఫున అత్యుత్తమ స్థాయి క్రికెట్‌ను ఆడుతూ.. ఫిట్‌నెస్ విషయంలో గొప్ప స్థాయిని కొనసాగిస్తున్నాడని హఫీజ్ ప్రశంసించాడు. 'మాలిక్ సుమారు 21 నుంచి 22 సంవత్సరాలుగా పాకిస్థాన్‌కు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. ఇంత ఎక్కువ కాలం ఫిట్‌నెస్ ప్రమాణాలను కొనసాగించడం చాలా గొప్ప విషయం' అని హఫీజ్ క్రికెట్ పాకిస్థాన్ మీడియాతో పేర్కొన్నాడు.

పాకిస్థాన్ క్రికెట్ ఎంత క్రూరమైనదో..?
ఈ ఏడాది ప్రారంభంలో.. మహమ్మద్ హఫీజ్ అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను మాలిక్‌కు కూడా రిటైర్మెంట్ ఇచ్చేయాలని సూచించినట్లు కూడా హఫీజ్ చెప్పాడు. 'నేను నా రిటైర్మెంట్ ప్రకటించే టైంలో షోయాబ్ మాలిక్‌ను కూడా రిటైర్మెంట్ తీసుకోమని చెప్పాను. ఎందుకంటే అతనికి ఇక జట్టులో గౌరవం దక్కదని నాకు తెలుసు. అది నా విషయంలో కూడా స్పష్టంగా జరిగింది. నా ఉద్దేశం ప్రకారం ఏమిటంటే.. అతను చివరిగా ఒక్కసారి జట్టు తరఫున ఆడాలని కోరుకున్నాడు. అయితే పాకిస్థాన్ క్రికెట్ ఇంత క్రూరమైనదో అది జరగడమే లేదు' అంటూ హాఫీజ్ పేర్కొన్నాడు.

జట్టు మేనేజ్‌మెంట్‌ది లోపాయికార స్వభావం
2019లో షోయాబ్ మాలిక్ చివరిసారిగా ఇంగ్లాండ్ అండ్ వేల్స్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఆ టోర్నీలో మహమ్మద్ హఫీజ్ కూడా ఆడాడు. ఇకపోతే మూడేళ్ల క్రితమే మాలిక్‌కు వీడ్కోలు మ్యాచ్‌ను పీసీబీ ఏర్పాటు చేసి ఉండాల్సిందని హఫీజ్ పేర్కొన్నాడు. 'దురదృష్టవశాత్తు అతను వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. అతనికి వన్డే ఫార్మాట్లో వీడ్కోలు మ్యాచ్ అవకాశం మాత్రం దక్కలేదు. ఇన్నేళ్ల పాటు జట్టుకు అతని సేవలను గ్రహించి.. అతనికి వీడ్కోలు మ్యాచ్ ఇవ్వాల్సింది. గొప్ప ప్లేయర్లకు వీడ్కోలు చెప్పేటప్పుడు మా జట్టు మేనేజ్‌మెంట్ ఎప్పుడూ కూడా లోపాయికారిగానే వ్యవహరించింది.' అని హఫీజ్ తెలిపాడు.

షోయాబ్ మాలిక్ కెరీర్..
షోయాబ్ మాలిక్ 1999లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇక చివరిసారిగా అతను జాతీయ జట్టు తరఫున 2021నవంబరులో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆడాడు. ఆ తర్వాత అతనికి జాతీయ జట్టులో చోటు దక్కలేదు. ఇప్పటివరకు షోయాబ్ మాలిక్ అంతర్జాతీయ క్రికెట్లో 35 టెస్టులు ఆడాడు. అలాగే పరిమిత ఓవర్ల క్రికెట్లో 287 వన్డేలు, 124 టీ20లు ఆడాడు. మాలిక్ 12 సెంచరీలు, 61 హాఫ్ సెంచరీల సహాయంతో టెస్టుల్లో 1898 పరుగులు, వన్డేల్లో 7534పరుగులు, టీ20ల్లో 2435పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications