Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Big Bash League : సెంచరీ మిస్ అయినా.. చివరి బంతికి గెలిపించేశాడుగా!

He misses century but wins the match for Brisbane in the final ball

థ్రిల్లర్ మ్యాచ్ అంటే ఏంటి? చివరి బంతి వరకు విజయం ఎవరిని వరిస్తుందో చూసే ప్రేక్షకుడికి తెలియకూడదు. అలాంటి మ్యాచ్ ఎప్పుడు జరిగినా అది చూసే వాడికి దొరికే మజానే వేరు. బిగ్ బ్యాష్ లీగ్‌లో సోమవారం నాడు అలాంటి మ్యాచే జరిగింది. బ్రిస్బేన్ హీట్, మెల్‌బోర్న్ హీట్ మధ్య జరిగిన మ్యాచ్‌ అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బ్రిస్బేన్ హీట్ బౌలింగ్ ఎంచుకుంది. మెల్‌బోర్న్ జట్టుకు మంచి ఆరంభం లభించకముందే ఓపెనర్ జో క్లార్క్ (4) పెవిలియన్ చేరాడు.

టామ్ రోజర్స్ (26) కాసేపు ఫర్వాలేదనిపించినా హిల్టర్ కార్ట్‌రైట్ (7) విఫలమయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యూ వెబ్‌స్టర్ (36) కూడా ఫర్వాలేదనిపించాడు. అయితే నిక్ లార్కిన్ (58) మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. నాథన్ కౌల్టన్ నైట్ (0) డకౌట్ కాగా.. జేమ్స్ సేమోర్ (13), క్లింట్ హించ్‌క్లిఫ్ (6 నాటౌట్) పరుగులు చేశారు. బ్రిస్బేన్ బౌలర్లలో మైకెల్ నెసర్ ఏకంగా నాలుగు వికెట్లు తీసుకున్నాడు. స్పెన్సర్ జాన్‌సన్, జేమ్స్ బాజ్లీ, మ్యాట్ రెన్‌షా తలో వికెట్ తీసుకున్నారు. దీంతో మెల్‌బోర్న్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.

ఛేజింగ్‌లో బ్రిస్బేన్‌కు కూడా సరైన ఆరంభం దక్కలేదు. జోష్ బ్రౌన్ (4) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. కెప్టెన్ ఉస్మాన్ ఖవాజా (14), మార్నస్ లబుషేన్ (6) కూడా విఫలమయ్యారు. అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన రెన్‌షా (90 నాటౌట్) జట్టును గెలిపించే బాధ్యతను భుజాలకు ఎత్తుకున్నాడు. శామ్ హైన్ (5) ఫెయిలైనా.. జిమ్మీ పీర్సన్ (22)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు రెన్‌షా. జేమ్స్ బాజ్లీ (9), మైకేల్ నెసార్ (1) అవుటైనా మైకేల్ ఖొనామెన్‌ (1 నాటౌట్)తో కలిసి రెన్‌షా లాంఛనం కూడా పూర్తి చేశాడు. చివరి బంతికి 4 పరుగులు కావలసి ఉండగా బౌండరీ కొట్టి జట్టును గెలిపించాడు. అతనికే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

Story first published: Monday, January 16, 2023, 19:49 [IST]
Other articles published on Jan 16, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+