Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మాకు పంత్ దొరికేశాడు.. సిక్సులు కొట్టేస్తాడు..(వీడియో)

‘He’ll Hit You For 6, He’ll Babysit Your Kids’: Fans Sing For Pant

సిడ్నీ: సిడ్నీ వేదికగా ఆతిథ్య జట్టుతో జరుగుతున్న చివరి టెస్టులో భార‌త బ్యాట్స్‌మెన్ హ‌వా కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ పుజారా (193), రిషబ్ పంత్ (159 నాటౌట్) సెంచరీలు నమోదు చేయడంతో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ని 622/7 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ సిరిస్‌లో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన ప్రదర్శనతో ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. అటు కీపింగ్‌తో పాటు, ఇటు బ్యాటింగ్‌లోని అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు.

చివరి టెస్ట్‌లో విశ్వరూపాన్ని

పర్యటనలో తనదైన స్లెడ్జింగ్‌తో హాట్‌టాపిక్‌గా నిలిచిన టీమిండియా యువ వికెట్‌ కీపర్ రిషభ్‌ పంత్‌.. చివరి టెస్ట్‌లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఇప్పటి వరకు ఆతిథ్య జట్టు ఆటగాళ్లకు మాటకు మాట బదులిస్తూ వార్తల్లో నిలిచిన పంత్‌.. సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో సెంచరీ బాదేసి.. ఆసీస్‌ గడ్డపై ఈ ఘనతను అందుకున్నాడు. ఇలా తొలి భారత వికెట్‌ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. 189 బంతుల్లో 159 పరుగులు చేసిన పంత్‌.. నోటితోనే కాదు బ్యాట్‌తోనూ బదులివ్వగలనని చాటి చెప్పాడు.

పంత్ బీభత్సానికి తోడు ఓ బ్యాండ్ కూడా

సిడ్నీలో పంత్ బీభత్సానికి తోడు అతనికి మద్ధతుగా ఓ బ్యాండ్ సందడి చేసింది. ఆసీస్ అభిమానులను వెక్కిరించేలా చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. మాకు పంత్ దొరికాడు. అంటూ పాట పాడుతూ ఓ సంగీత కచేరీ బృందం సిడ్నీ స్టేడియంలో సందడి చేసింది. మాకు పంత్ దొరికాడు. రిషబ్ పంత్. మీకిప్పటికే అర్థమై ఉంటుంది. అతను సిక్సులు కొడతాడు. మీ పాపల్ని ఆడిస్తాడు. మాకు పంత్ దొరికాడు.' అంటూ కాసేపు అభిమానులందరికీ వినోదాన్ని పంచింది.

137 బంతుల్లో సెంచరీ చేసేసి

దూకుడైన ఆటను ప్రదర్శించి వంద పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కేవలం 137 బంతుల్లో సెంచరీ చేయడం గమనార్హం. ఇప్పటి వరకూ తొమ్మిది టెస్టులు ఆడిన పంత్‌కు ఇది రెండో టెస్టు సెంచరీ. ఇలా భారత వికెట్ కీపర్లలో సెంచరీ సాధించిన తొలి వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు మాత్రమే కాకుండా.. పర్యాటక జట్లలో సెంచరీ చేసిన రెండో వికెట్ కీపర్‌గా నిలిచాడు రిషబ్ పంత్. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనలు చేసిన పంత్.. రెండు పర్యటనలలోనూ సెంచరీ దాటేశాడు.

Story first published: Friday, January 4, 2019, 16:15 [IST]
Other articles published on Jan 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+