Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

షోయబ్‌ అక్తర్‌ నన్ను చంపుతానన్నాడు: స్టార్ బౌలర్‌

He just smiled and said I’m gonna kill you: Liam Plunkett recalls frightening encounter with Shoaib Akhtar

లండన్: అంతర్జాతీయ క్రికెట్‌ అరంగేట్రానికి ముందే పాకిస్తాన్‌ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ చంపుతానంటూ తనను బెదిరించాడని ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ లియామ్‌​ ప్లంకెట్‌ తెలిపాడు. 2005లో పాకిస్తాన్‌తో లాహోర్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌ ద్వారా అరంగేట్రం చేసిన తనకు తొలి మ్యాచ్‌కు ముందే చేదు అనుభవాలు ఎదురయ్యాయని పేర్కొన్నాడు. తొలి మ్యాచ్ కోసం రనప్‌ చేస్తున్న సమయంలో.. చంపుతానంటూ అక్తర్ వార్నింగ్‌ ఇచ్చాడని ప్లంకెట్‌ చెప్పాడు.

చంపేస్తా అంటూ గట్టిగా అరిచాడు:

చంపేస్తా అంటూ గట్టిగా అరిచాడు:

'ది బ్రోకెన్ ట్రోఫీ' పోడ్‌కాస్ట్‌లో లియామ్‌​ ప్లంకెట్‌ మాట్లాడుతూ... 'కౌంటీ క్రికెట్‌లో షోయబ్‌ అక్తర్‌ కోసం లెగ్‌ స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తే.. స్టీవ్‌ హార్మిసన్‌ కోసం స్లిప్‌లో ఉండేవాడిని. వారు అప్పటినుండే తెలుసు. ఇక అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లో అక్తర్‌తో తలపడటం అదే తొలిసారి. ఆ మ్యాచ్‌ కోసం నేను ప్రాక్టీస్‌లో భాగంగా రనప్‌ చేస్తున్నా. అప్పుడు అక్కడికి వచ్చిన అక్తర్‌ నన్ను చూసి నవ్వాడు. ఆ వెంటనే నిన్ను చంపేస్తా అంటూ గట్టిగా అరిచాడు. నన్ను భయభ్రాంతులకు గురిచేశాడు' అని తెలిపాడు.

మొదటి మ్యాచ్ కావడంతో ఆందోళనకు గురయ్యా:

మొదటి మ్యాచ్ కావడంతో ఆందోళనకు గురయ్యా:

'మ్యాచ్‌ ఆరంభమైన తర్వాత రెండో రోజు ఆటకు సిద్ధమయ్యా. నాకు తొలిరోజు ఆటలానే అనిపించింది. నేను బ్యాట్‌ పట్టుకుని కూర్చొని ఉ‍న్నా. ఎందుకంటే.. తర్వాత బ్యాటింగ్‌ చేసేది నేనే. ఆ సమయంలో అక్తర్ గంటకు 96,97 మైళ్ల వేగంతో బౌలింగ్‌ చేస్తున్నాడు. టీవీ స్క్రీన్లలో అది నాకు కనబడుతుంది. అప్పడు అక్తర్‌ అన్న మాటలు నాకు గుర్తొచ్చాయి. అదే మొదటి మ్యాచ్ కావడంతో కొంత ఆందోళనకు గురయ్యా. ఆష్లే గైల్స్‌ వికెట్‌ను అక్తర్‌ తీయడంతో నేను బ్యాటింగ్‌ వెళ్లాను' అని ప్లంకెట్‌ చెప్పాడు.

సమీ బౌలింగ్‌లో ఔటయ్యా:

సమీ బౌలింగ్‌లో ఔటయ్యా:

'ఏదేమైనా 90 మైళ్ల వేగంతో బౌలింగ్‌ చేసే అక్తర్‌ను ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధపడ్డా. నేను ఆడిన తొలి బంతినే సమర్థవంతంగా ఎదుర్కొన్నా. ఆ తర్వాత ఓ బంతి నా భుజాన్ని తాకింది. కానీ నేను అక్తర్ బౌలింగ్‌కు ఏమాత్రం భయపడలేదు. క్రీజ్‌లో పాతుకుపోవడానికి ప్రయత్నించా. ఆ క్రమంలోనే 51 బంతులు ఆడి 9 పరుగులు చేశా. నా బాధ్యతను నేను నిర్వర్తించాననుకున్నా. దాదాపు 10 ఓవర్లు క్రీజ్‌లో ఉండి అక్తర్‌కు పరీక్షగా నిలిచా. నేను చివరికు మహ్మద్‌ సమీ బౌలింగ్‌లో ఔటయ్యా. నా వికెట్‌ అక్తర్‌కు లభించకపోయినా నన్ను స్లెడ్జ్‌ చేసే క‍్రమంలో ఏదో మ్యూజిక్‌ చేశాడు' అని లియామ్‌​ ప్లంకెట్‌ చెప్పుకొచ్చాడు.

గంటకి 161.3కిమీ వేగం:

గంటకి 161.3కిమీ వేగం:

షోయబ్ అక్తర్‌ పాక్‌ తరపున 46 టెస్టుల్లో 176 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు, 15 టీ20 ల్లో 19 వికెట్స్ పడగొట్టాడు. పాకిస్థాన్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 224 మ్యాచ్‌లు ఆడిన అక్తర్.. 444 వికెట్లతో ప్రపంచంలో అత్యంత భయంకరమైన బౌలర్లలో ఒకరిగా నిలిచాడు. 2003 వన్డే ప్రపంచకప్‌లో గంటకి 161.3కిమీ వేగంతో బంతిని విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మరోవైపు ప్లంకెట్‌ ఇంగ్లండ్ తరపున 13 టెస్టులు, 89 వన్డేలు, 22 టీ20లు ఆడాడు.

Story first published: Monday, June 22, 2020, 19:35 [IST]
Other articles published on Jun 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+