న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జట్టులో సౌరవ్ గంగూలీ చోటు కోల్పోయినప్పుడు ఏం చేశాడో తెలుసా?

'He Is The Best Man To Do The Job' : Sehwag On Sourav Ganguly || Oneindia Telugu
“He Is The Best Man To Do The Job” – Virender Sehwag On BCCI President Sourav Ganguly

హైదరాబాద్: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. దేశవాళీ క్రికెట్‌ను అభివృద్ధి చేయడానికి సౌరభ్‌ గంగూలీనే సరైనోడని సెహ్వాగ్‌ చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ జాతీయ పత్రికకు రాసిన కాలమ్‌లో ఈ విషయాన్ని సెహ్వాగ్ వెల్లడించాడు.

AUS vs SL: బర్త్‌డే రోజు సెంచరీ.. వాట్సన్‌, మ్యాక్స్‌వెల్‌ సరసన వార్నర్‌!!AUS vs SL: బర్త్‌డే రోజు సెంచరీ.. వాట్సన్‌, మ్యాక్స్‌వెల్‌ సరసన వార్నర్‌!!

గంగూలీ తన ప్రారంభ ప్రకటనలో

గంగూలీ తన ప్రారంభ ప్రకటనలో

"గంగూలీ తన ప్రారంభ ప్రకటనలో దేశవాళీ క్రికెట్‌ను మెరుగుపరుస్తానని చెప్పడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ పని చేయడానికి గంగూలీనే సరైనోడు. దేశవాళీ క్రికెట్‌లోని సమస్యలన్నీ అతడికి తెలుసు. జాతీయ జట్టులో దాదా చోటు కోల్పోయినప్పుడు దేశవాళీ క్రికెట్‌ ఆడుతూ దేశమంతటా పర్యటించాడు" అని అన్నాడు.

నాకు ఇప్పటికీ గుర్తు

నాకు ఇప్పటికీ గుర్తు

"నాకు ఇప్పటికీ గుర్తు... తిరిగి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న తర్వాత దేశవాళీ క్రికెట్‌లోని లోపాల గురించి నాతో చర్చించాడు. అంతకముందు ఎనిమిది నుంచి పది ఇన్నింగ్స్‌ల్లో అతడు ప్లాప్ అయినప్పటికీ... దానిని మరిచిపోయే విధంగా దాదా ఆటగాళ్లను ఉత్తేజపరుస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపేవాడు" అని సెహ్వాగ్ తెలిపాడు.

100 శాతం ఇవ్వడంతో పాటు

100 శాతం ఇవ్వడంతో పాటు

"దీంతో వారు నిజంగానే బాగా రాణిస్తున్నాడని అనుకునేవారు. ఆ విశ్వాసంతో ఆ ఆటగాడు తన 100 శాతం ఇవ్వడంతో పాటు జట్టుకు విజయాలు అందించేవాడు. నాయకుడిగా అదే సౌరవ్ గంగూలీకి అదే ప్రధానబలం. దాదా తెలివైన సహజసిద్ధ నాయకుడు. అందరి అభిప్రాయాలను గౌరవిస్తాడు. కానీ, ఏది సరైనదని భావిస్తాడో అదే చేస్తాడు" అని సెహ్వాగ్‌ తెలిపాడు.

39వ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ బాధ్యతలు

39వ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ బాధ్యతలు

అక్టోబర్‌ 23న బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2000 నుంచి 2005 మధ్య కాలంలో కెప్టెన్‌గా భారత జట్టుకు సేవలందించిన సౌరవ్ గంగూలీ టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన రెండో క్రికెటర్‌గా గంగూలీ చరిత్ర సృష్టించాడు.

Story first published: Monday, October 28, 2019, 11:48 [IST]
Other articles published on Oct 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X