'అప్పటి నుంచే శిఖర్ పిచ్చి పట్టింది.. ధావన్‌ను దేవుడిగా ఆరాధిస్తున్నా'

ఢిల్లీ: ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. ఇది టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ విషయంలో నిజమే అనిపిస్తోంది. అచ్చం ధావన్ పోలికలతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ 27 ఏడేళ్ల యువకుడు ఉన్నాడు. అతడే రామ్ బహదూర్. ఇతగాడు ధావన్ ఫ్యాన్స్‌తో పాటు అతని అభిమానాన్ని కూడా పొందాడు. ఇక్కడ రామ్ బహదూర్ తన కొడుకుకు కూడా 'జొరావర్' అని పేరు పెట్టుకున్నాడు.

ధావన్‌లా కనిపిస్తున్నావ్ బయ్యా
రామ్ బహదూర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు వీరాభిమాని ఎలా అయ్యాడో తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ చెప్పాడు. రామ్ బహదూర్ ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో జన్మించాడు. లక్నోలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. బహదూర్ ఓ రోజు సెలూన్ షాప్‌నకు వెళ్లగా.. బార్బర్ అతడికి కటింగ్ పూర్తిచేసాడు. అనంతరం 'భయ్యా నువ్వు అచ్చం భారత ఓపెనర్ శిఖర్ ధావన్'లా కనిపిస్తున్నావు అన్నాడట. అవునా అని బహదూర్ అడగ్గా.. నిజమే చెపున్నా అని బార్బర్ చెప్పాడట. అయితే మీసకట్టు కూడా ధావన్‌లా మార్చేస్తే.. 100% అలానే ఉంటావ్ అని బార్బర్ చెప్పాడు.

శిఖర్ అనే పిచ్చి పట్టింది:
బార్బర్ బహదూర్ మీసకట్టును అచ్చం ధావన్‌లా మార్చి.. శిఖర్ ఫొటోను రామ్ బహదూర్ ముందు ఉంచాడట. అద్దంలో చూసుకున్న బహదూర్.. తెగ సంబరపడిపోయాడట. అప్పటి నుంచి బహదూర్.. గబ్బర్ స్టయిల్‌ను ఫాలో అవుతుండడంతో అతనికి చాలా మంది అభిమానులు అయ్యారట. బహదూర్ మాట్లాడుతూ... 'బార్బర్ మాటలు నాపై చాలా ప్రభావం చూపాయి. ఇంటికి వచ్చాక అద్దంలో చూసుకున్నా. నిజమే అనిపించింది. వెంటనే శిఖర్ సర్ పోస్టర్ తీసుకువచ్చి గోడపై అంటించా. నాకు నేను కొత్తగా కనిపించాను. అప్పటి నుంచి శిఖర్ అనే పిచ్చి పట్టింది' అని తెలిపాడు.

ధావన్‌ను దేవుడిగా ఆరాధిస్తున్నా
'అప్పటి నుంచి శిఖర్ సర్‌లా దుస్తులు వేసుకోవడం.. గడ్డం, మీసకట్టు మార్చుకున్నా. 2013 నుంచి ధావన్‌ను దేవుడిగా ఆరాధిస్తున్నా. 2015లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ మ్యాచ్ సందర్భంగా తనను శిఖర్ సర్‌లా దుస్తులు ధరించడం, గడ్డం, మీసకట్టు మార్చుకున్నాను. 2013 నుంచి ధావన్‌ను దేవుడిగా ఆరాధిస్తున్నా. 2015లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ మ్యాచ్ సందర్భంగా తనను కలిసే అవకాశం వచ్చింది. రాయ్‌పూర్‌లో మే 9న స్టేడియం బయట నిల్చుని ఉన్నా. అప్పుడే క్రికెటర్ల బస్సు వచ్చింది. నన్ను శిఖర్ గుర్తుపట్టాడు. బస్సు నుంచి దిగి వచ్చి హత్తుకున్నాడు. నేను ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాను. ఆ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి' అని రామ్ బహదూర్ చెప్పాడు.

ఒక్క మ్యాచ్ మిస్ కాలేదు
'ఆ తర్వాత నుంచి మా ఇద్దరి మధ్య బంధం మొదలైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌లు చేసుకుంటాం. ఆయన నాకు కచ్చితంగా రిప్లై ఇస్తాడు. 2017లో ఓ రోజు న్యూజిలాండ్-భారత్ మ్యాచ్ ముందు కాన్పూర్‌లో ప్రాక్టీసు చేస్తున్న సమయంలో 'గాడ్' అంటూ అరిచాను. ధావన్ నన్ను చూసి దగ్గరకు వచ్చాడు. టికెట్ దొరికిందా అని అడిగితే.. లేదన్నాను. వెంటనే హోటల్‌కు తీసుకువెళ్లి టిక్కెట్లు చేతిలో పెట్టాడు. ఇంతవరకు భారత్‌లో జరిగిన శిఖర్ మ్యాచ్ నేను ఒక్కటి కూడా మిస్ కాలేదు. ధావన్‌లా కనిపించడం వల్ల కొంతమంది నాకు కూడా అభిమానులుగా మారిపోయారు' అని బహదూర్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications