For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్వారంటైన్ నుంచి నేరుగా మ్యాచ్: కోల్‌కత బౌలర్: రూ.15.5 కోట్లు: కాస్ట్‌లీగా రన్స్: డీకే సపోర్ట్

he is just off quarantine, says KKR skipper Dinesh Karthik has backed Pat Cummins

అబుధాబి: ఆస్ట్రేలియన్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్.. మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఐపీఎల్-2020 సీజన్‌లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఈ ఆల్‌రౌండర్ తొలి మ్యాచ్‌లో రాణించలేకపోయాడు. ధారాళంగా పరుగులను సమర్పించుకున్నాడు. ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ సాధించడానికి పరోక్షంగా కారకుడయ్యాడు. కోల్‌కత నైట్ రైడర్స్ బౌలింగ్ విభాగానికి బ్యాక్ బోన్‌గా భావించే ప్యాట్ కమ్మిన్స్.. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కనీసం తన నాలుగు ఓవర్ల కోటాను కూడా పూర్తి చేయలేకపోయాడంటే.. అతని ఫెయిల్యూర్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

 కమ్మిన్స్ ప్రభావం చూపలేకపోవడానికి

కమ్మిన్స్ ప్రభావం చూపలేకపోవడానికి

కోల్‌కత నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీ పాట్ కమ్మిన్స్‌ను 15.5 కోట్ల రూపాయలను పెట్టి కొనుగోలు చేసింది. అయినప్పటికీ.. ఆ స్థాయిలో రాణించలేకపోయాడు. మూడు ఓవర్లు మాత్రమే వేసిన పాట్.. ఏకంగా 49 పరుగులను సమర్పించుకున్నాడు. ఒక్క వికెట్ కూడా అతని ఖాతాలో పడలేదు. అతని బౌలింగ్ ఆద్యంతమూ నాసిరకంగా కనిపించింది. లైన్ అండ్ లెంగ్త్ తప్పిపోయాడు. దాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నంలో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. తప్పుల మీద తప్పులు చేశాడు. ఓ సాధారణ బౌలర్‌లా మారిపోయాడు. బంతి ఎక్కడ? ఎలా వేయాలనే విషయాన్ని కూడా మర్చిపోయినట్లుగా సాగింది అతని బౌలింగ్.

క్వారంటైన్ నుంచి నేరుగా..

క్వారంటైన్ నుంచి నేరుగా..

పాట్ కమ్మిన్స్ నాసిరకం ప్రదర్శనకు కారణాలు లేకపోలేదు. క్వారంటైన్‌ నుంచి నేరుగా మ్యాచ్ ఆడాడు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి విధించిన నిబంధనలో భాగంగా.. ప్రతి క్రికెటర్ కూడా క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. దాన్ని పూర్తి చేసుకున్న పాట్.. చివరి నిమిషంలో టీమ్‌లో చేరాడు. తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. మ్యాచ్ సాయంత్రం 7:30కు ఆరంభం కావాల్సి ఉండగా.. 3:30 గంటలకు అతణ్ని ఆడటానికి అవకాశం లభించింది. దీనితో పెద్దగా ప్రాక్టీస్ అనేది లేకుండా నేరుగా మ్యాచ్‌లో దిగాడు. ప్రభావాన్ని చూపలేకపోయాడు.

వరల్డ్ క్లాస్ బౌలర్.. తప్పు పట్టలేం..

వరల్డ్ క్లాస్ బౌలర్.. తప్పు పట్టలేం..

పాట్ కమ్మిన్స్ వైఫల్యాన్ని కోల్‌కత నైట్ రైడర్స్ స్కిప్పర్ దినేష్ కార్తీక్ ఏ మాత్రం తప్పు పట్టట్లేదు. అది అతని వైఫల్యంగా తాను భావించట్లేదని చెప్పాడు. కమ్మిన్స్ వరల్డ్ క్లాస్ బౌలర్ అనడంలో సందేహాలు అక్కర్లేదని, అతని స్థాయికి తగినట్టుగా ఆడతాడనీ అన్నాడు. క్వారంటైన్ నుంచి నేరుగా మ్యాచ్ ఆడటానికి వచ్చిన ప్రభావం అతనిపై పడందని చెప్పాడు. ప్రాక్టీస్ లేకుండా గ్రౌండ్‌లోకి దిగాడని పేర్కొన్నాడు. తమ ఓటమికి పాట్ కమ్మిన్స్‌ను బాధ్యుడిని చేయడం మంచిది కాదని అన్నాడు. అతనిపై తనకు పూర్తి విశ్వాసం ఉందని దినేష్ కార్తీక్ స్పష్టం చేశాడు.

భారీ స్కోరును అందుకోలేక..

భారీ స్కోరును అందుకోలేక..

అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్-2020 అయిదో మ్యాచ్‌లో కోల్‌కత ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ 196 పరుగుల భారీ లక్ష్యాన్ని అందుకోలేక చతికిల పడింది. బ్యాటింగ్ లైనప్ బలంగా ఉన్నప్పటికీ.. ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా తమ స్థాయిలో ఆడలేకపోయారు. ఇవాన్ మోర్గాన్, ఆండ్రీ రస్సెల్, దినేష్ కార్తీక్, సునీల్ నరైన్, శుభ్‌మన్ గిల్.. ఇలా ఒక్కరు కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ముంబై నిర్దేశించిన 196 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో కేకేఆర్‌ 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.

Story first published: Thursday, September 24, 2020, 9:55 [IST]
Other articles published on Sep 24, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+