For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మీరు చేసినట్లుగా..గంభీర్ వెన్నుపోటు పొడవడు- పాకిస్థాన్ మాజీ

పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శన గురించి ఆ దేశ మాజీ క్రికెటర్లు కీలక వ్యాఖ్యలు చేయడం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ జాబితాలో మాజీ లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా చేరాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను పాకిస్థాన్ 0-2తో కోల్పోయిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై విజయం లేకుండా పాక్ వరుసగా పది టెస్టులు ముగించింది. 2021 నుంచి పాక్‌కు గెలుపు దక్కట్లేదు.

గత పది మ్యాచ్‌ల్లో ఆరింట్లో ఓటమి పాలైంది. నాలుగ మ్యాచ్‌లను డ్రాగా ముగించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, బంగ్లా చేతిలో సిరీస్‌లను కోల్పోయింది. న్యూజిలాండ్‌తో సిరీస్‌ను డ్రాగా ముగించింది. ఈ క్రమంలో గత ఆరు దశాబ్దాల్లో టెస్టు ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ తమ పేలవ ర్యాంక్‌ను అందుకుంది. ఎనిమిదో స్థానానికి పడిపోయింది. 1965 తర్వాత టెస్టు ర్యాంకింగ్స్‌లో పాక్‌కు ఇదే దారుణమైన ర్యాంక్.

He Doesn t Backbite Ex-Spinner Calls for a Tough Coach Like Gautam Gambhir Amid Pakistan Cricket s Struggles

అయితే ఈ ఘోర పరాజయాలకు కారణం కెప్టెన్సీ మార్పులే అని డానిష్ కనేరియా మండిపడ్డాడు. సారథిగా నియమిస్తే వాళ్లకు మద్దతు ఇవ్వాలని అన్నాడు. అంతేకానీ వెన్నుపోటు పొడవకూడదని, గంభీర్‌లా ముక్కుసూటిగా వ్యవహరించాలని పేర్కొన్నాడు. వన్డే వరల్డ్ కప్ అనంతరం బాబర్ అజామ్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత టీ20లకు షాహిన్ అఫ్రిదిని, టెస్టులకు షాన్ మసూద్‌లను సారథిగా ఎంపిక చేశారు. అఫ్రిదిని ఓ సిరీస్ అనంతరమే కెప్టెన్ పోస్ట్ నుంచి తొలగించారు. తిరిగి బాబర్‌ను పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా నియమించారు. ఇప్పుడు బాబర్‌, షాన్ మసూద్‌ను కూడా తొలగించే యోచనలో పాక్ బోర్డు ఉంది.

''కెప్టెన్లను మార్చడం, కొత్త వాళ్లను నియమించడమే పాకిస్థాన్ క్రికెట్ పతనానికి ప్రధాన కారణం. సారథి మార్పు పనిచేయలేదు. కెప్టెన్‌కు మద్దతు ఇస్తూ అతనితోనే ఉండాలి. ఉదాహరణకు.. ఓ ఏడాదికి నేను కెప్టెన్‌ను నియమించాను. సంవత్సరం తర్వాత అతన్ని ప్రశ్నిస్తాను. నేను సపోర్ట్ చేసినంత కాలం మరెవరూ అతన్ని టచ్ చేయలేరు''

''అయితే అతను మంచి ప్రదర్శన చేయాలి. మీరు మెరుగైన ప్రదర్శన చేయలేకపోతే సారథి బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే పనులు జరగవు. ఇక ఇతర జట్లు బాగా రాణిస్తున్నాయి. భారత్ రాణించడానికి కారణం ఏంటి? జట్టుతో గొప్పగా పనిచేసే ద్రవిడ్ ఉన్నాడు. ఆ తర్వాత గంభీర్ వచ్చాడు. అతను అద్భుతమైన వ్యక్తి. అతను ఫేస్ చూస్తేనే రియాక్షన్ అర్థమవుతుంది. అంతేకానీ గంభీర్ వెన్నుపోటు పొడిచే వ్యక్తి. ముక్కుసూటిగా వ్యవహరిస్తాడు. గంభీర్‌లా ఉండాలి. ఏదైనా ఫేస్ టూ ఫేస్ చేయాలి'' అని డానిష్ కనేరియా పేర్కొన్నాడు.

Story first published: Saturday, September 7, 2024, 18:49 [IST]
Other articles published on Sep 7, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+