నెం.4 స్థానంలో రిషబ్ పంత్‌ని ఆడిస్తే: గేమ్ ఛేంజర్ అంటూ పంత్‌పై దాదా


హైదరాబాద్: ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్‌లో రిషబ్ పంత్‌ను నెం.4 స్థానంలో ఆడించాలని డిమిండియా మాజీ కెప్టెన్ రిషబ్ పంత్ డిమాండ్ చేశాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో రిషబ్ పంత్ (159 నాటౌట్) అద్భుత సెంచరీతో సరికొత్త రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే.
దీంతో టెస్టులతో పాటు వన్డే, టీ20ల్లోనూ రిషబ్ పంత్‌కి ఇకపై సెలక్టర్లు అవకాశమివ్వాలని సౌరవ్ గంగూలీ సూచించాడు. తాజాగా గంగూలీ మాట్లాడుతూ "రిషబ్ పంత్ అద్భుతమైన ఆటగాడు. అతను అలవోకగా మ్యాచ్‌ని భారత్‌వైపు తిప్పలగలడు. అందుకే ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్‌లో నెం.4 స్థానంలో అతడ్ని ఆడించాలని సెలక్టర్లకి సూచిస్తున్నా" అని అన్నాడు.

నెం.4 స్థానంలో రిషబ్ పంత్‌ని ఆడిస్తే
"ఫాస్ట్ బౌలర్లని సమర్థంగా ఎదుర్కొంటూ అతను బౌండరీలు సాధిస్తున్న తీరు అమోఘం. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ టాప్-3లో ఆడుతూ మ్యాచ్‌ల్ని గెలిపిస్తున్నారు. వారికి తోడుగా, నెం.4 స్థానంలో రిషబ్ పంత్‌ని ఆడిస్తే? భారత్‌కి తిరుగుండదు. రిషబ్ పంత్‌లా ఆ స్థానంలో ఆడగలిగే సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు ఇప్పుడు టీమ్‌లో ఎవరూ లేరు" అని గంగూలీ అన్నాడు.

మ్యాచ్‌లు మలుపు తిప్పగలిగే ఇన్నింగ్స్‌లు
"అంబటి రాయుడు, కేదార్ జాదవ్, మహేంద్రసింగ్ ధోనీ తమ పరిధి మేర ఆడుతున్నారు. కానీ.. రిషబ్ పంత్ మాత్రం మ్యాచ్‌లు మలుపు తిప్పగలిగే ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. కాబట్టి.. అతడికి సెలక్టర్లు తగినన్ని అవకాశాలివ్వాలి" అని సౌరవ్ గంగూలీ సూచించాడు. నిజానికి వన్డేల్లో నెం.4 స్థానంలో అంబటి రాయుడు రాణిస్తోన్న సంగతి తెలిసిందే.

జనవరి 12న సిడ్నీ వేదికగా తొలి వన్డే
నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ అనంతరం భారత్-ఆస్ట్రేలియా మధ్య జనవరి 12 నుంచి మూడు వన్డేల సిరీస్ మొదలు కానుంది. ఈ మూడు వన్డేల సిరిస్‌లో రిషబ్ పంత్‌పై వేటు వేసిన సెలక్టర్లు ధోనీకి వికెట్ కీపర్‌గా అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే. జనవరి 12న సిడ్నీ వేదికగా తొలి వన్డే.. ఆ తర్వాత అడిలైడ్ వేదికగా 15న రెండో వన్డే, 18న మెల్‌బోర్న్‌లో చివరి వన్డే జరగనుంది.

ఆసీస్‌తో వన్డే సిరిస్‌కు టీమిండియా:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, చాహల్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, మహ్మద్ షమీ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications