నేను ఏడ్వడమా.. అదెప్పుడు జరిగింది..: హర్బజన్

ముంబై: టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మరోసారి ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్‌పై మండిపడ్డాడు. పదేళ్ల కిందట సిడ్నీ టెస్ట్‌లో భాగంగా భజ్జీ తనను మంకీ అన్నాడంటూ సైమో ఆరోపించిన విషయమే మరోసారి కోపం తెప్పించడానికి కారణమైంది. ఆ తర్వాత పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకున్నాడంటూ సైమండ్స్‌పై ఆరోపణలు గుప్పించాడు. ఈ ఘటన తర్వాత మూడేళ్లకు తాము ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్‌లో కలిసి ఆడామని సైమండ్స్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అప్పుడు భజ్జీ తనకు క్షమాపణ చెప్పి ఆ ఘటన గురించి ఏడ్చాడని సైమండ్స్ చెప్పుకొచ్చాడు.

సీరియస్‌గా రియాక్టయిన భజ్జీ
దీనిపై భజ్జీ సీరియస్‌గా రియాక్టయ్యాడు. ట్విటర్ వేదికగా స్పందించాడు. నేను ఏడ్చానా.. ఇది ఎప్పుడు జరిగింది? ఎందుకు? అంటూ ప్రశ్నించాడు. 2008లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిడ్నీ టెస్ట్‌లో హర్భజన్, సైమండ్స్ మధ్య వివాదం ఎంత సంచలనం సృష్టించిందో మనకు తెలుసు. భజ్జీ తనను మంకీ అన్నాడని, అవి జాతి వివక్ష ఆరోపణలే అని సైమండ్స్ ఫిర్యాదు చేయడంతో అప్పట్లో హర్భజన్‌పై 3 మ్యాచ్‌ల నిషేధం కూడా విధించారు. ఆ తర్వాత టీమిండియా ఫైట్ చేయడంతో ఆ నిషేధాన్ని ఎత్తేశారు.

హర్భజన్ తన దగ్గరకు వచ్చి క్షమాపణ
మూడేళ్లకు భజ్జీ, సైమండ్స్ ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడారు. ఆ సందర్భంగా జట్టంతా ఓ పార్టీకి వెళ్లిన సమయంలో హర్భజన్ తన దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పాడని, కంటతడి కూడా పెట్టుకున్నాడని ఫాక్స్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైమండ్స్ చెప్పాడు. పలు మార్లు ఇదే విషయంపై మాట్లాడిన భజ్జీ.. ఒకానొక ఇంటర్వ్యూలో.. తనను ఒక మాటంటే ఎదురు తిరిగి రెండు మాటలు అంటానని, అందువల్లే ఆస్ట్రేలియా క్రికెటర్లకు తానంటే భయమని చెప్పుకొచ్చాడు.

మీ అమ్మచేతి రొట్టెలు తినాలనుందని మాత్రమే
ఓ దశ దాటాక ఆస్ట్రేలియా ఆటగాళ్లు నన్ను కవ్వించడం మానేశారని చెప్పాడు. సైమండ్స్‌తో గొడవ విషయానికి వస్తే అతణ్ని మంకీ అనలేదని, మీ అమ్మచేతి రొట్టెలు తినాలనుందని మాత్రమే వ్యాఖ్యానించానని, అయితే, అతను ఇదంతా వినలేదని, ఎందుకంటే సైమండ్స్‌కు హిందీ తెలియదని, తనకు ఇంగ్లిష్ రాదని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications