Uppal Stadium: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కు బిగ్ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఉన్న నార్త్ స్టాండ్‌కు అజారుద్దీన్ పేరు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. అజారుద్దీన్ పేరును తొలగించాలని అంబుడ్స్‌మన్ జస్టిస్ ఈశ్వరయ్య హైదరాబాద్ క్రికెట్ సంఘాన్ని ఆదేశించారు. లార్డ్స్ క్రికెట్ క్లబ్ వేసిన పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో ఈ కీల నిర్ణయం తీసుకున్నారు. అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఏకపక్షంగా తన పేరు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు గుర్తించారు.

ఈ క్రమంలో జస్టిస్ ఈశ్వరయ్య ఈ కీలక తీర్పునిచ్చారు. వెంటనే నార్త్ స్టాండ్ కు అజారుద్దీన్ పేరును తొలగించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను ఆదేశించారు. టికెట్లపై కూడా అజారుద్దీన్ స్టాండ్ అనే పేరు ఉండొద్దని తేల్చి చెప్పారు. ఇదిలా ఉండగా.. భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం అధికారులపై 2023లో అవినీతి కేసు నమోదైన సంగతి తెలిసిందే. వీరంతా అసోసియేషన్ సొమ్మును దుర్వినియోగం చేశారని పోలీసులు తెలిపారు. వారిపై పోలీసులు దర్యాప్తు కూడా జరిపారు.