IPL 2021: ఐపీఎల్ 2021 ఆతిథ్యానికి హైదరాబాద్ సిద్ధం: అజహరుద్దీన్

హైదరాబాద్: కరోనా వైరస్‌ ఉధృతి నేపథ్యంలో ముంబై నుంచి తరలించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ మ్యాచ్‌లకి ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ నగరం సిద్ధంగా ఉందని హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ అన్నారు. ఈ మేరకు అజ్జూ భాయ్‌ ఆదివారం తమ వద్ద లభించే సౌకర్యాల వివరాలను భారత క్రికెట్ మండలి (బీసీసీఐ)కి ఓ లేఖ ద్వారా అందించారు. ముంబై మహా నగరంలో కరోనా కేసులు రోజురోజులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. శనివారం కొత్తగా 9108 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.

 కరోనా బారిన పడ్డ ఆటగాళ్లు:

కరోనా బారిన పడ్డ ఆటగాళ్లు:

ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మ్యాచులకు ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు సిటీలు ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. ముంబైలో ఏర్పాటు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్‌లో ఉన్న ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ ఇప్పటికే కరోనా బారినపడగా.. అక్కడే ఉంటున్న చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడికి కరోనా పాజిటివ్ అని తేలింది. అంతేకాకుండా.. వాంఖడే స్టేడియంలో ఉన్న 19 మంది గ్రౌండ్స్‌మెన్‌లలో ఏకంగా 10 మంది వైరస్ బారినపడ్డారు. దాంతో వాంఖడేలో మ్యాచ్‌లు నిర్వహించడం ఎంసీఏకి ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది.

 స్టాండ్-బై వేదికలుగా ఇండోర్, హైదరాబాద్:

స్టాండ్-బై వేదికలుగా ఇండోర్, హైదరాబాద్:

ముంబైలో కరోనా వైరస్ వ్యాప్తి పతాక స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా పునరాలోచనలో పడింది. 10 మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనున్న ముంబైకి.. ఇండోర్, హైదరాబాద్‌లను స్టాండ్-బై వేదికలుగా ఉంచాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇక ప్రస్తుతానికి ముంబైలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లకు వాంఖడే స్టేడియంలోకి ప్రవేశం లేదు. వాంఖడే స్టేడియంలో మొదటి మ్యాచ్ ఏప్రిల్ 10న జరగనుంది. ఆ మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ తలపడనున్నాయి.

 ఒకరికొకరు అండగా ఉందాం:

ఒకరికొకరు అండగా ఉందాం:

'ఈ కష్టకాలంలో మనం ఒకరికొకరు అండగా ఉందాం. ఐపీఎల్ 2021 మ్యాచులను సురక్షితమైన, భద్రమైన వేదికలలో నిర్వహించేలా చూడాలనుకుంటున్నాం. ఇందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తన సౌకర్యాలను బీసీసీఐ దృష్టికి తీసుకువస్తున్నది' అని మహ్మద్ అజారుద్దీన్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో రాశారు. అయితే పరిస్థితులు ఇంతగా దిగజారినా ముంబైలో ఆటలకు ఆతిథ్యం ఇస్తానని బీసీసీఐ సీనియర్ ఆఫీసు బేరర్ శనివారం విశ్వాసం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ జట్లు అన్నీ బయో బబుల్‌ ఉండటంతో టోర్నమెంట్‌ నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.

వారాంతాల్లో పూర్తి లాక్‌డౌన్‌:

వారాంతాల్లో పూర్తి లాక్‌డౌన్‌:

ముంబైలో శనివారం కొత్తగా 9108 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. కరోనా కట్టడికి మహారాష్ట్ర సర్కార్‌ చర్యలు చేపట్టింది. సోమవారం నుంచి రాష్ట్రమంతటా రాత్రి కర్ఫ్యూ అమలులోకి రానున్నది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. ఇక వారాంతాల్లో పూర్తి లాక్‌డౌన్‌ను అమలు చేస్తారు. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉంటుంది. వారాంతరాల్లో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతించనున్నారు. థియేటర్లు, పార్కులు, హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు మూసివేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

IPL 2021: మిగిలిన ఆ ఒక్క మెట్టు ఎక్కాలనుకుంటున్నాం.. అదే మా లక్ష్యం: కైఫ్‌

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, April 4, 2021, 19:45 [IST]
Other articles published on Apr 4, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X