Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆఫర్ అదిరింది.. ఇది అసలైన కిక్ - తిలక్ వర్మ

రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్‌లో హైదరాబాద్ జట్టు అదరగొట్టింది. ఫైనల్‌లో మేఘాలయపై విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ గెలుపుతో ఎలీట్ గ్రూప్‌లో చోటు దక్కించుకుంది. ప్లేట్ గ్రూప్‌లో హైదరాబాద్ అజేయ జట్టుగా సత్తాచాటడం విశేషం. అయితే హైదరాబాద్ జట్టును మరింత ప్రోత్సహించడానికి హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్ మోహన్ రావు ఆటగాళ్లకు ఓ ఆఫర్ ఇచ్చారు.

వచ్చే మూడేళ్లలో రంజీ ట్రోఫీ ఎలీట్‌ గ్రూ‌ప్‌లో హైదరాబాద్‌ ఛాంపియన్‌గా నిలిస్తే జట్టుకు రూ.1 కోటి నజరానా అందిస్తామని అధ్యక్షుడు జగన్ మోహన్ రావు ప్రకటించారు. అంతేగాక ఒక్కో ఆటగాడికి ఖరీదైన బీఎండబ్ల్యూ కారు‌ను బహుమతిగా ఇస్తామని తెలిపారు. దీనిపై హైదరాబాద్ జట్టు కెప్టెన్, యువ సంచలనం తిలక్ వర్మ స్పందించాడు.

HCA offer is great its good news for the players - Tilak Varma

హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ నుంచి ఆటగాళ్లకు ప్రోత్సహంగా నగదు బహుమతి, కార్లు అందిస్తామని వెల్లడించడం ఆనందంగా ఉందని తిలక్ వర్మ పేర్కొన్నాడు. ఈ ఆఫర్ ఆటగాళ్లకు మరింత ఉత్సాహాన్నిస్తుందని తెలిపాడు. కాగా, ప్లేట్ గ్రూప్‌లో ఛాంపియన్‌గా నిలిచినందుకు జట్టుకు హెచ్‌సీఏ రూ.10 లక్షలు నజరానా ప్రకటించింది.

అంతేగాక ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు రూ.50 వేలు బహుమతిగా అందజేసింది. కెప్టెన్‌ తిలక్‌వర్మ, ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌, స్పిన్నర్‌ తనయ్‌ త్యాగరాజన్‌, బ్యాటర్లు నితేశ్ రెడ్డి, ప్రజ్ఞయ్‌ రెడ్డికి ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా రూ.50,000 నగదు ఇచ్చింది. తన్మయ్ అగర్వాల్ రికార్డు ట్రిపుల్ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. మేఘాలయపై జరిగిన ఫైనల్లో నితేశ్, ప్రజ్ఞయ్‌ సెంచరీలు సాధించారు.

ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్లో హైదరాబాద్‌ అయిదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 198 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ సునాయాసంగా చేధించింది. తిలక్ వర్మ(64), రాహుల్ సింగ్(62) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మేఘాలయ 304 పరుగులకు ఆలౌటైంది. త్యాగరాజన్ అయిదు వికెట్లతో సత్తా చాటాడు.

అనంతరం హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 350 పరుగులు చేసింది. నితేశ్ రెడ్డి(122), వికెట్ కీపర్ ప్రజ్ఞయ్ రెడ్డి(102) శతకాలతో రాణించారు. తిలక్ వర్మ(44) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఫలితంగా మేఘాలయ కంటే తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మేఘాలయ.. 243 పరుగులకు ఆలౌటైంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ మరోసారి అయిదు వికెట్లతో సత్తా చాటాడు.

Story first published: Wednesday, February 21, 2024, 12:15 [IST]
Other articles published on Feb 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+