HCA Elections: అజహరుద్దీన్ ఘన విజయం, అధ్యక్షుడిగా ఎన్నిక

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికల్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ ఘన విజయం సాధించారు. దీంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మహ్మద్ అజహరుద్దీన్ ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో అజహర్ 74 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ఈ మేరకు ఎన్నికల అధికారులు అధికారిక ప్రకటన చేశారు. అజహరుద్దీన్ నేతృత్వంలోని ప్యానెల్ ఆరు స్థానాలను కైవసం చేసుకుంది. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, జాయింట్ సెక్రటరీ, కౌన్సిలర్, ట్రెజరర్, సెక్రటరీ తదితర స్థానాలను సొంతం చేసుకుంది. ఆసోసియేషన్ చరిత్రలో అన్ని స్థానాలను ఒకే ప్యానెల్ కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి.
ఈ మేరకు ఎన్నికల అధికారులు అధికారిక ప్రకటన చేశారు. శుక్రవారం నగరంలోని ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో అసోసియేషన్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 226 ఓట్లకు గాను 223 ఓట్లు పోల్ అయ్యాయి. అజహర్‌కు 147 ఓట్లు పడగా, ప్రకాశ్ జైన్ 73, దిలీప్ కుమార్ 3 ఓట్లు పడ్డాయి. అర్జున్ యాదవ్, నిజాం క్లబ్, భారతి సిమెంట్స్ ప్యానెల్ ఓటు వేయలేదు.

అన్ని ప్యానెల్స్ అజహరుద్దీన్ వైపే
హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అన్ని ప్యానెల్స్ అజహరుద్దీన్ వైపే మొగ్గు చూపాయి. ఈ ఎన్నికల బరిలో మొత్తం మూడు ప్యానెల్స్ ఉన్నాయి. ప్రధాన పోటీ మాత్రం అజహరుద్దీన్, ప్రకాశ్ చంద్ జైన్ ప్యానళ్ల మధ్యే కొనసాగింది. హెచ్‌సీఏ అధ్యక్షుడి మినహా మిగతా ఐదుస్థానాలకు ఈ రెండు ప్యానెళ్ల మధ్య గట్టి పోటీ ఎదురైంది.

హెచ్‌సీఏ ఎన్నికల్లో
హెచ్‌సీఏ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరిగింది. అనంతరం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు హక్కుని వినియోగించుకున్న సభ్యులు
155 ప్రైవేట్ క్లబ్‌లకు చెందిన ప్రతినిధులతో పాటు 51 ఆయా సంస్థల క్లబ్‌లు, తొమ్మిది జిల్లా క్రికెట్ సంఘాలు, 11 మంది మాజీ క్రికెటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు గడ్డం వివేక్ నామినేషన్ తిరస్కరణ కావడంతో అతడు అజారుద్దీన్‌కు వ్యతిరేకంగా ప్రకాష్ ప్యానెల్‌కు మద్దతు ఇచ్చారు.

అజహరుద్దీన్ ఘన విజయం
అయినప్పటికీ అజహరుద్దీన్ ఘన విజయం సాధించడంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడి కావాలన్న తన కల ఫలించినట్లయ్యింది. 2017లో ఇదే పదవికి అజార్ నామినేషన్ వేసినప్పటికీ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవితకాల నిషేధం ఉండడంతో హెచ్‌సీఏ అధికారులు అజార్ నామినేషన్‌ను తిరస్కరించారు. బీసీసీఐ అతడికి క్లీన్‌చిట్ ఇచ్చినప్పటికీ ఆ పత్రాలు సమర్పించలేదన్న కారణంతో నామినేషన్‌ను తిరస్కరించినట్టు హెచ్‌సీఏ అప్పట్లో పేర్కొంది. అయితే హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి మరోసారి పోటీపడ్డ అజహర్ విజయం సాధించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications