Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

HCA Elections: ఇకనైనా హెచ్‌‌సీఏకు మంచిరోజులొస్తాయా..?

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఎన్నికలు శుక్రవారం జరుగుతున్నాయి. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు జరగనుంది. స్టేడియంలోనే రిటర్నింగ్ అధికారి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీఎస్ సంపత్ సమక్షంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.

ఈ ఎన్నికల్లో మొత్తం 173 మంది ఓటు వేయనుండగా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, కౌన్సిలర్‌ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే పోటీలో నాలుగు క్రికెట్ అసోసియేషన్ ప్యానెల్స్ పాల్గొంటున్నాయి. అలాగే ఈ ఎన్నికల ఫలితాలు సాయంత్రం 4 తర్వాత వెలువడనున్నాయి.

HCA Elections Four pannels fighting in HCA Elections

సుప్రీం కోర్టు ద్వారా జస్టిస్ లావు నాగేశ్వర రావు ఆధ్వర్యంలో నియమించిన సింగిల్ మెంబర్ కమిటీ ఈ ఎన్నికలను పర్యవేక్షిస్తోంది. అలాగే వీఎల్ సంపత్ రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఎన్నికల్లో గెలుపుపై ధీమాగా ఉన్న నాలుగు ప్యానెల్స్‌ పోటా పోటీగా ప్రెస్ మీట్స్ నిర్వహిస్తున్నాయి.

ఎన్నికల్లో పోటీ పడుతున్న సభ్యులు:
ప్రెడిసెంట్: ఏ జగన్మోహన్ రావు, అమర్నాథ్, డాక్టర్ కే అనిల్ కుమార్, పీఎల్ శ్రీనివాస్.
వైస్ ప్రెసిడెంట్: సీ బాబురావు, గుండాల శ్రీనివాసరావు, పీ శ్రీధర్, సర్దార్ దల్జీత్ సింగ్
సెక్రటరీ: ఆర్ దేవరాజ్, డాక్టర్ ఆర్ హరినారాయణరావు, ఆర్ ఎం భాస్కర్, వీ ఆగమ్ రావు.
జాయింట్ సెక్రటరీ: చిట్టి శ్రీధర్, నోయల్ డేవిడ్, సతీష్ చంద్ర శ్రీవాస్తవ, టీ బసవ రాజు.
కోశాధికారి: సీజే శ్రీనివాస్ రావు, సీ సంజీవ్ రెడ్డి, గెరార్డ్ కార్, పీ మహేంద్ర.
కౌన్సిలర్: డీఏజే వాల్టర్, డాక్టర్ అన్సార్ అహ్మద్ ఖాన్, సునీల్ కుమార్, వినోద్ కుమార్ ఇంగ్లే.

ఏది ఏమైనా సార్వత్రిక ఎన్నికలను తలపించేలా జరుగుతున్న హెచ్‌సీఏ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లూ అవినీతి ఆరోపణలతో సతమతమైన అసోసియేషన్‌.. కొత్తగా ఎన్నికైన సభ్యుల ఆధ్వర్యంలో అయినా గాడిలో పడుతుందా..? లేదా? అనేది చూడాలి.

Story first published: Friday, October 20, 2023, 14:37 [IST]
Other articles published on Oct 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+