Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ విషయంలో సుప్రీంకోర్టు షాకింగ్ నిర్ణయం!

HCA committee disbanded by Supreme Court

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీ రద్దయింది. ఈ మేరకు భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ప్రస్తుతం హెచ్‌సీఏలో ఉన్న కమిటీని రద్దు చేసి, దాని స్థానంలో ఏక సభ్య కమిటీని నియమిస్తున్నట్లు తెలిపింది. ఈ నూతన కమిటీ జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలో పని చేయనుంది. ఇకపై హెచ్‌సీఏ వ్యవహారాలన్నీ ఈ కమిటీనే చూసుకుంటుందని స్పష్టం చేసంది. ఈ కొత్త కమిటీ ఆధ్వర్యంలోనే హెచ్‌సీఏ ఎన్నికలు నిర్వహించాలని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే కోరారు.

గతంలో జస్టిస్ లావు నాగేశ్వరరావు పర్యవేక్షణలోనే ఇండియన్ ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఎలక్టోరల్ కాలేజీ ఖరారైందని ఆయన సుప్రీంకోర్టుకు వివరించారు. ఇప్పటికే ఐఓఏ ముసాయిదా రాజ్యాంగాన్ని పర్యవేక్షిస్తున్నారని కూడా తెలిపారు. ఆయన వాదనలు విన్న సుప్రీంకోర్టు వీటిపై సానుకూలంగా స్పందించింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ ఇచ్చే నివేదికను బట్టి తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది.

హెచ్‌సీఏలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని చాలా రోజులుగా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. టీమిండియా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ నేతృత్వంలో ఉన్న హెచ్‌సీఏపై ఇదే కమిటీలోని మరికొందరు విమర్శల వర్షం కురిపించారు. అలాగే గతేడాది టీ20 మ్యాచ్ సమయంలో టికెట్ల అమ్మకాల విషయంలో పెద్ద గొడవ జరిగిన సంగతి తెలిసిందే. అన్ని టికెట్లు ఆన్‌లైన్‌లో అమ్మాలని డిమాండ్లు వచ్చాయి. అయితే వీటిని అజారుద్దీన్ కార్యవర్గం పట్టించుకోలేదు.

దీనిపై తెలంగాణ క్రీడాశాఖ మంత్రి కూడా సీరియస్ అయ్యారు. టికెట్ల అమ్మకాల విషయంలో అవకతవకలు, అక్రమాలు జరిగితే ఊరుకునేది లేదన్నారు. మరికొన్ని రోజుల్లోనే ఐపీఎల్ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో మ్యాచులు ఉంటాయి. వీటి టికెట్లను ఎలా అమ్ముతారో అని ఇప్పటికే కొందరు అభిమానులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇలాంటి క్రమంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. వర్గపోరుతో హెచ్‌సీఏలో కుమ్ములాటలు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. కొత్త కమిటీ అయినా పరిస్థితిని చక్కదిద్దుతుందని ఆశిస్తున్నారు.

Story first published: Tuesday, February 14, 2023, 20:26 [IST]
Other articles published on Feb 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+