క్రైస్ట్ చర్చ్: ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ నాలుగో రోజున వివాదం చెలరేగింది. ఆసిస్ బౌలర్ హాజిల్‌వుడ్ థర్డ్ అంపైర్ పైన మాట జారాడు. క్రైస్ట్ చర్చ్‌లో జరుగుతున్న టెస్టులో చివరి ఓవర్ బౌలింగ్ చేసిన హాజిల్ వుడ్.. ఓ యార్కర్‌ను విలియమ్సన్ కాళ్లపై సంధించాడు.
ఆ వెంటనే మైదానంలోని అంపైర్ రణమోర్ మార్టినెజ్ నాటౌట్‌గా ప్రకటించాడు. కెప్టెన్ స్మిత్ రివ్యూను కోరాడు. బంతిని పలుమార్లు పరిశీలించిన థర్డ్ అంపైర్ రిచర్డ్ లిల్లింగ్ వర్త్ అది నాటౌట్‌గానే నిర్ణయించాడు. దీంతో హాజిల్‌వుడ్‌కు కోపం వచ్చింది.

దీంతో అంపైర్ మార్టినెజ్ వద్దకు వెళ్లి వాదనకు దిగాడు. 'హూ ద ఫ.. ఈజ్ ది థర్డ్ అంపైర్' అన్నాడు. అతని మాటలు రికార్డ్ అయ్యాయి. ఆ సమయంలో కామెంటేటర్లుగా ఉన్న వారు, హాజిల్ మాటలను తప్పుబట్టారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ హాజిల్‌వుడ్, స్మిత్‌ల పైన విచారణకు ఆదేశించారు. కాగా, హాజిల్‌వుడ్ న్యూజిలాండ్ బ్యాట్సుమెన్ అండర్సన్‌తోను వాదనకు దిగాడని తెలుస్తోంది.