యువీకి ప్రేమతో: హాజెల్ కీచ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది
హైదరాబాద్: కటక్‌లోని బారాబతి స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో వెటరన్ ఆటగాడు యువరాజ్ సింగ్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. యువీ సెంచరీ చేసిన సందర్భంగా ఫ్యాన్స్‌తో పాటు పలువురు ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
127 బంతుల్లో యువరాజ్ 150 పరుగులు చేశాడు. ముఖ్యంగా ధోనీతో కలిసి ఇంగ్లాండ్ బౌలర్లను చితకబాదిన తీరు అద్భుతం. రెండు నెలల క్రితమే యువీని పెళ్లి చేసుకున్న హేజిల్ కీచ్ ఈ ఇన్నింగ్స్‌ను చూసి చాలా ముచ్చట పడిపోయారు. యువీ భార్య హజెల్ కీచ్.. తన భర్తకు ప్రేమతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టింది.
అందులో తన భర్త ఇంగ్లాండ్ పైనా, గతంలో కేన్సర్‌పైన చేసిన పోరాటం గురించి ఆమె వివరించారు. అదేంటంటే 'యువీ పేరు మధ్యలో 'ఫియర్స్' అనే పదాన్ని జోడించాలని కీచ్ చెప్పారు. ''127 బంతుల్లో 150 పరుగులు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ఇంగ్లాండ్‌పై వన్డే సిరీస్‌లో భారత్ 2-0 గెలిచింది. కేన్సర్‌ను ఓడించి అతడు తిరిగి రావడాన్ని మర్చిపోలేం. మళ్లీ సంపూర్ణ ఆరోగ్యవంతుడై, ఫిట్‌నెస్ సాధించి, కెమోథెరపీ తర్వాత కూడా మళ్లీ వన్డే టీమ్‌లోకి వచ్చాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు'' అంటూ హజెల్ తన భర్తను తెగ పొగిడేసింది.
ఆమె ఈ విషయమై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు అందరికీ విపరీతంగా నచ్చింది. ఆమె షేర్ చేసిన ఫొటోకు, రాసిన కామెంట్లకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఇన్‌స్టాగ్రామ్‌లో యువీ బ్యాటింగ్ ఫొటోతో ఆమె పెట్టిన కామెంట్‌కు ఇప్పటికి 25వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.
మరోవైపు సామాన్యుడికి ఇది సాధ్యం కాదని, యువరాజ్ మాత్రమే దాన్ని సుసాధ్యం చేసి చూపించాడని ఒకరు అంటే, నిజంగా నిజం హేజల్.. అతడో హీరో.. అతడికి సెల్యూట్ చేస్తున్నా అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, క్రికెటర్లు సచిన్, సెహ్వాగ్, గంగూలీ, హర్భజన్, నటులు రితేష్ దేశ్‌ముఖ్, వరుణ్ ధవన్ తదితరులు యువీ, ధోనీలను ఆకాశానికెత్తేశారు.
యువీకి ప్రేమతో భార్య హాజెల్ కీచ్
‘యువీ పేరు మధ్యలో ‘ఫియర్స్' అనే పదాన్ని జోడించాలని కీచ్ చెప్పారు. ''127 బంతుల్లో 150 పరుగులు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ఇంగ్లాండ్‌పై వన్డే సిరీస్‌లో భారత్ 2-0 గెలిచింది. కేన్సర్‌ను ఓడించి అతడు తిరిగి రావడాన్ని మర్చిపోలేం. మళ్లీ సంపూర్ణ ఆరోగ్యవంతుడై, ఫిట్‌నెస్ సాధించి, కెమోథెరపీ తర్వాత కూడా మళ్లీ వన్డే టీమ్‌లోకి వచ్చాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు'' అంటూ హజెల్ తన భర్తను తెగ పొగిడేసింది.
యువీ ఆటతీరుపై ప్రశంసలు కురిపించిన అమితాబ్
యువరాజ్ ఆటతీరుపై బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ ఆయనపై ప్రశంసలు కురిపించారు. 150 పరుగులతో రాణించి సిరీస్ కైవసం చేసుకునేలా చేసిన యువరాజ్ సింగ్ అసాధారణమైన ఛాంపియన్ అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఇంగ్లండ్ జట్టును ఓడించడం ఓ అరుదైన విజయమని అన్నారు.
యువీని చూసి నేర్చుకోవాలి
కటక్ వేదికగా జరిగిన రెండో వన్డేలో 150 పరుగులు చేసిన యువరాజ్ సింగ్ కు ప్రశంసలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం తనదైన శైలిలో ఉద్వేగభరితమైన ట్వీట్ చేశాడు. ‘అతను (యువీ) కేన్సర్ ను ఓడించాడు. ఇవాళ ఇంగ్లండ్ బౌలర్లను ఓడించాడు. నిరాశ చెందకూడదని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి' అని ట్వీటాడు. అంతే కాకుండా కేన్సర్ తో పోరాడుతున్న సందర్భంలో యువీకి తీసిన ఫోటోను కూడా సెహ్వాగ్ పోస్టు చేశాడు.
సచిన్ టెండూల్కర్
బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. యువీ, ధోనీలు అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారని ట్వీట్ చేశాడు. యువీని సూపర్ స్టార్ గా, ధోనీని రాక్ స్టార్ గా అభివర్ణించాడు. వీరి ఆటను ఎంజాయ్ చేశానని ట్విట్టర్ లో పోస్టు చేశాడు.
సౌరభ్ గంగూలీ
ఇద్దరూ అద్భుతంగా ఆడారు. యువీలో ఇప్పటికీ సత్తా తగ్గలేదు.
హార్భజన్ సింగ్
చాలా అద్భుతంగా ఆడావు మై బ్రదర్. సూపర్ సెంచరీ. ఈ ఛాంపియన్‌ని ఎవరూ ఆపలేరు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications