Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తండ్రి కాబోతున్న యువరాజ్‌?: తల్లి షబ్నం ఏమన్నారంటే!

హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి కాబోతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిని చూసిన వారంతా త్వరలో యువీ తండ్రి కాబోతున్నాడంటూ ట్వీట్లు పెట్టారు.

అయితే సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని యువీ తల్లి షబ్నం సింగ్‌ వెల్లడించారు. 'హజెల్‌ గర్భవతి కాదు. యువీ, హజెల్‌కి పెళ్లి అయి 10 నెలలు మాత్రమే అయింది. ఆమె గర్భవతి కావడానికి ఇంకా సమయం ఉంది. హజెల్‌ గర్భవతి అని వస్తోన్న వార్తలు అవాస్తవం' అని షబ్నం పేర్కొంది.

Hazel Keech pregnant? Here’s what Yuvraj Singh’s mother Shabnam has to say

అంతేకాదు, ఇలాంటి వార్తలపై ఎందుకు ఇంత త్వరగా స్పందిస్తారని ప్రశ్నించింది. ఇష్టమొచ్చినట్లు, ఎవరికి తోచినట్లు వారు ఏదో ఒకటి రాసేయకండని... ఒక్కోసారి అవి బాధను కలిగిస్తాయని ఆమె పేర్కొంది. అయితే హజెల్‌ గర్భవతి అని వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు.

Hazel Keech pregnant? Here’s what Yuvraj Singh’s mother Shabnam has to say

గతంలో కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి. ఓ ప్రముఖ ఎంటర్టైన్ మెంట్ పోర్టల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో హజెల్‌కి ఇదే ప్రశ్నే ఎదురైంది. 'నేను గర్భవతినైతే అందులో దాచాల్సింది ఏముంది. ఆ విషయం సంతోషంగా అందరికీ చెప్తాను' అని హజెల్‌ సున్నితంగా సమాధానమిచ్చింది. గతేడాది నవంబర్‌లో గోవాలో వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+