యువీ కోసం ఆమె: చప్పట్లు కొడుతూ సందడి (ఫోటోలు)
న్యూఢిల్లీ: స్టేడియంలో క్రికెటర్లు మ్యాచ్ ఆడుతుంటే ఫ్యాన్స్‌తో పాటు కుటుంబ సభ్యులు ఆటగాళ్లకు మద్దతు తెలపడంతో పాటు ప్రోత్సహించడం అందిరికీ తెలిసిందే. ఇటీవల మధ్య కాలంలో క్రికెటర్ల ప్రియురాళ్లు కూడా మైదానానికి వచ్చి ఆటగాళ్లను ఉత్సాహపరుస్తున్నారు.
గతంలో విరాట్ కోహ్లీ-అనుష్క, రోహిత్ శర్మ-రితిక, హార్భజన్ సింగ్-గీతాబస్రాలు ఇటువంటి కోవకు చెందిన వారే. అయితే ఈ ముగ్గురిలో రోహిత్ శర్మ, హార్భజన్ సింగ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ మధ్య ప్రేమాయణం ఎప్పుడు చిగురిస్తుందో, ఎప్పుడు బ్రేకప్ అవుతుందో అభిమానులకు కూడా అంతుబట్టడం లేదు.
అయితే తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో యువరాజ్ సింగ్- హెజెల్ కీజ్‌ల జంట స్టేడియాల్లో సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో యువరాజ్ సింగ్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యువీ ఆడుతున్న అన్ని మ్యాచ్‌ల్లో కీచ్ స్టేడియానికి వచ్చి సందడి చేస్తోంది.
ఐపీఎల్‌లో భాగంగా న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో తన స్నేహితురాళ్లతో కలిసి హెజెల్ సందడి చేసింది. త్వరలోనే హెజెల్ కీచ్‌ను పెళ్లి చేసుకోనున్నట్లు గతేడాది సోషల్ మీడియాలో యువరాజ్ సింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో యువీ 30 బంతుల్లో 44 పరుగులు చేసి హైదరాబాద్ 162 పరుగులు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ 22 పరుగుల తేడాతో కోల్‌కత్తా జట్టుపై విజయం సాధించి క్వాలిఫయిర్ 2లో గుజరాత్ లయన్స్ జట్టుతో శుక్రవారం తలపడనుంది.

యువీ కోసం ఆమె: చప్పట్లు కొడుతూ సందడి
ఐపీఎల్‌లో భాగంగా న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో తన స్నేహితురాళ్లతో కలిసి హెజెల్ సందడి చేసింది.

యువీ కోసం ఆమె: చప్పట్లు కొడుతూ సందడి
త్వరలోనే హెజెల్ కీచ్‌ను పెళ్లి చేసుకోనున్నట్లు గతేడాది సోషల్ మీడియాలో యువరాజ్ సింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

యువీ కోసం ఆమె: చప్పట్లు కొడుతూ సందడి
ఈ మ్యాచ్‌లో యువీ 30 బంతుల్లో 44 పరుగులు చేసి హైదరాబాద్ 162 పరుగులు చేయడంలో కీలకపాత్ర పోషించాడు.

యువీ కోసం ఆమె: చప్పట్లు కొడుతూ సందడి
ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ 22 పరుగుల తేడాతో కోల్‌కత్తా జట్టుపై విజయం సాధించి క్వాలిఫయిర్ 2లో గుజరాత్ లయన్స్ జట్టుతో శుక్రవారం తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications