సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెనర్ మాథ్యు హైడెన్ అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు. తన 17 ఏళ్ల ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు 103 టెస్ట్‌మ్యాచ్‌ల అనుభవానికి తాను ఇంతటితో ముగింపు పలుకుతున్నానని ఈరోజు ఉదయం తన అభిమాన వేదికైన గాబ్బా గ్రౌండ్‌లో ప్రకటించాడు.
37 ఏళ్ల హెడెన్ దేశంలోని కొద్దిమంది ఆల్‌టైమ్ సెంచరీమేకర్స్‌లో ఒకడిగా నిలిచాడు. ఇటీవలకాలంలో మాత్రం అనేకసార్లు విఫలమయ్యాడు. గత వారం ఆస్ట్రేలియా 20:20, లిమిటెడ్ ఓవర్ మ్యాచ్‌లనుంచి అతన్ని ఆస్ట్రేలియా బోర్డు తొలగించింది. అయితే త్వరలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లతో జరగనున్న మ్యాచ్‌లలో అతనికి అవకాశం కల్పించే విషయాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. అయితే ఈలోగానే హెడెన్ ఈరోజు ఉదయం అంతర్జాతాయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.