Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాల్గో రోజు హెడన్ జోరు

Matthew Hayden
సిడ్నీ:వికెట్ నష్టపోకుండా 13 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఆసీస్ జట్టు నాల్గవ రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు నష్టపోయి 282 పరుగులు చేసింది. ఓపెనర్ మాథ్యూ హెడెన్ సెంచరీ సాధించడం నాలుగోరోజు విశేషం. హెడెన్ 196 బంతుల్లో 12 పోర్లతో ఈ సెంచరీ సాధించాడు. తొలి వికెట్ కు జాక్వెస్(42)తో కలిసి 85 పరుగులు జోడించిన హెడెన్, హస్సీ(87 నాటౌట్)తో కలిసి మూడవ వికెట్ భాగస్వామ్యంలో 140 పరుగులు జోడించి అనిల్ కుంబ్లే బౌలింగ్ లో అవుటయ్యాడు. అంతకుముందు ఒక పరుగు మాత్రమే చేసిన కెప్టెన్ రికీ పాంటింగ్, హర్భజన్ సింగ్ సింగ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. క్లార్క్ కూడా పరుగులేమి చేయకుండా కంబ్లే బౌలింగ్లో అవుటయ్యాడు. ఆట ముగిసే సమయానికి 87 పరుగులతో క్రీజ్ లో ఉన్న హస్సీ పది ఫోర్లు కొట్టాడు. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో అండ్రూ సైమండ్స్(14) నాటౌట్ గా ఉన్నాడు. నాల్గవ రోజు పలుమార్లు వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. తొలి ఇన్నింగ్స్ లో 69 పరుగులు వెనుకపడిన ఆసీస్ జట్టు 213 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఆదివారం ఆటకు చివరి రోజు.
Story first published: Saturday, January 5, 2008, 16:50 [IST]
Other articles published on Jan 5, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+