For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబై, చెన్నైల్లో తన ఫేవరెట్​ జట్టేదో చెప్పిన హర్భజన్.. కారణం ఇదే!!

Have to choose Mumbai Indians over Chennai Super Kings: Harbhajan Singh on favourite IPL team


ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అంతకు ముందు ఆడిన ముంబై ఇండియన్స్, ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్​ రెండు జట్లలో ఫేవరెట్​ జట్టు ఏదని టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్​ను ఓ అభిమాని ప్రశ్న అడిగాడు. అభిమాని ప్రశ్నకు హర్భజన్ కాస్త ఇబ్బంది పడినా.. చివరకు సమాధానం మాత్రం చెప్పాడు. అందుకు కారణాలను కూడా భజ్జీ వివరించాడు.
ముంబై నా ఫేవరెట్ జట్టు:

ముంబై నా ఫేవరెట్ జట్టు:

గురువారం హర్భజన్ సింగ్​ ఇన్​స్టాగ్రామ్ లైవ్​లో పాల్గొని అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలో ఓ అభిమాని కష్టమైన ప్రశ్న సంధించాడు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్​ రెండింట్లో ఫేవరెట్​ జట్టు ఏదని భజ్జీని అడగ్గా.. ముంబై ఇండియన్స్​ తన ఫేవరెట్ జట్టు అని బదులిచ్చాడు. అయితే అందుకు కారణాలను భజ్జీ వివరించాడు. 'ముంబై ఇండియన్స్​ తరఫున పదేళ్లు ఆడా. అది నా జీవితం. ముంబైతో జ్ఞాపకాలను, ఆ ప్రేక్షకులను, వాంఖడే స్టేడియాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. నా మనసు ముంబై ఇండియన్స్​తోనే ఉంటుంది' అని చెప్పాడు.

 చెన్నైతో చాలా సంతోషంగా ఉన్నా:

చెన్నైతో చాలా సంతోషంగా ఉన్నా:

'ప్రస్తుతం నేను చెన్నై సూపర్ కింగ్స్​ జట్టులో ఉన్నా. ఈ జట్టులో పొందుతున్న ప్రేమ పట్ల చాలా సంతోషంగా ఉన్నా. కానీ ఫేవరెట్​గా నేను ముంబైనే ఎంపిక చేసుకుంటా' అని హర్భజన్ సింగ్ అన్నాడు. భారతదేశం లేదా ఇంగ్లాండ్ ఏ దేశాన్ని ఎక్కువగా ఇష్టపడుతారు అని అడగ్గా.. 'మీరు నన్ను ఇబ్బందుల్లో పడేస్తున్నారు. నాది భారతదేశం, నా భార్య గీతా బాస్రాది ఇంగ్లాండ్. భారతదేశం నా జీవితం, నా భార్య కూడా అంతే' అని భజ్జీ తెలివిగా సమాధానం ఇచ్చాడు.

క్రికెట్ వచ్చే ఏడాది కూడా ఆడుకోవచ్చు:

క్రికెట్ వచ్చే ఏడాది కూడా ఆడుకోవచ్చు:

'కరోనా వైరస్ కారణంగా దేశంలో చాలా మంది చనిపోతున్నందున ఐపీఎల్ 2020 జరుగుతుందని నేను అనుకోను. ఈ కఠిన సమయంలో ఐపీఎల్ అంత ముఖ్యమైనది కాదు. ప్రస్తుతం క్రికెట్ కంటే ప్రజల ప్రాణాలను కాపాడటం చాలా ముఖ్యం. క్రికెట్ వచ్చే ఏడాది కూడా ఆడుకోవచ్చు' అని హర్భజన్ అన్నాడు. 2008 నుండి 2017 వరకు హర్భజన్ సింగ్ ముంబై ఇండియన్స్‌ తరపున ఆడాడు. రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టడానికి ముందే 30 మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. అంతేకాదు 2011లో ముంబైకి ఛాంపియన్స్ లీగ్ టైటిల్‌ను అందించాడు.

తొలిసారైతే వింతగా అనిపించింది:

తొలిసారైతే వింతగా అనిపించింది:

'చెన్నై జెర్సీ వేసుకున్న తొలిసారైతే వింతగా అనిపించింది. అసలేం జరుగుతుంది. ఇది కలనా? నిజమా? అర్థం కాలేదు. ముంబై తరఫున చెన్నైతో ఆడినప్పుడల్లా భారత్-పాక్ మ్యాచ్‌లా అనుకునేవాళ్లం. మ్యాచ్ కూడా చాలా టఫ్‌గా ఉండేది. కానీ ఆకస్మాత్తుగా నేను బ్లూ జెర్సీకి బదులు ఎల్లో జెర్సీ ధరించడం కష్టంగా అనిపించింది. అదృష్టవశాత్తు చెన్నై తరఫున నా తొలి మ్యాచ్ కూడా ముంబైతోనే జరిగింది. ప్రారంభంలోనే ఆడటం కూడా నాకు మంచిదైంది. తొలి సీజన్ అంతా కొంచెం కష్టంగా అనిపించింది. టైటిల్ గెలిచిన తర్వాత మాత్రం అలవాటైపోయింది. రెండో సీజన్ బాగా సాగింది. ఇక ఆ ఫీలింగ్ కలగలేదు' అని భజ్జీ తెలిపాడు.

Story first published: Friday, May 8, 2020, 9:31 [IST]
Other articles published on May 8, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+