Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందరం తప్పులు చేస్తుంటాం, అంఫైర్ తప్పిదంపై జో రూట్

హైదరాబాద్: ఆటలో అంఫైర్ తీసుకున్న నిర్ణయాలను ఆటగాళ్లు గౌరవించాల్సిందేనని ఇంగ్లాండ్ టాప్ బ్యాట్స్‌మెన్ జో రూట్ పేర్కొన్నాడు. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన రెండో టీ20 చివరి ఓవర్లో అంపైర్ షంషుద్దీన్‌ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్‌ను ఎల్బీడబ్యూగా ప్రకటించడం వల్లే తాము ఓడిపోయాని ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మూడో టీ20 సందర్భంగా జో రూట్ బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో బుధవారం మీడియాతో మాట్లాడాడు. 'ఆటలో ఎప్పుడూ అంఫైర్లతో తనకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆటలో ఓ ఆటగాడిగా మనం ఎలాంటి తప్పులు చేస్తుంటామో అంఫైర్లు కూడా అలానే చేస్తుంటారు' అని అన్నాడు.

Have no problems with umpire Shamshuddin, we all make mistakes: JoeRoot

రెండో వన్డేలో చివరి ఓవర్‌ వేసిన టీమిండియా పేసర్ బుమ్రా.. జోరూట్‌ను తన తొలి బంతికే ఎల్‌బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేర్చాడు. అయితే ఆ బంతి జో రూట్ బ్యాట్‌కు తగిలిన తర్వాతే అతని ప్యాడ్లకు తాకినట్లు రీప్లేలో స్పష్టమైంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్‌పై భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.

చివరి ఓవర్ వేసిన బుమ్రాపై జో రూట్ ప్రశంసలు కురిపించాడు. డెత్ ఓవర్లలో బుమ్రా అద్భుతమైన బౌలింగ్ చేశాడని కొనియాడాడు. టెస్టులు మాదిరి టీ20ల్లో కూడా డీఆర్‌ఎస్ విధానాన్ని ఎందుకు అమలు చేయాలని అన్న కెప్టెన్ మోర్గాన్ వ్యాఖ్యలపై కూడా జో రూట్ స్పందించాడు.

టీ20ల్లో కూడా డీఆర్ఎస్ విధానాన్ని అమలు చేస్తే బాగుంటుందని అన్నాడు. ఏది ఏమైనా, మూడో టీ20 కోసం ఎదురు చూస్తున్నట్లు జో రూట్ తెలిపాడు. భారత పర్యటన టఫ్‌గా ఉందని చెప్పిన రూట్ ఈ పర్యటనను ఎంతో ఎంజాయ్ చేశానని చెప్పాడు. కాగా, మూడు టీ20ల సిరిస్‌లో చివరిదైన టీ20 బెంగుళూరులో గురువారం జరగనుంది.

మ్యాచ్ ప్రారంభం: రాత్రి 7 గంటలకు

జట్ల వివరాలు:
ఇండియా: విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్ కీపర్), మనీష్ పాండే, హార్ధిక్ పాండ్యా, పర్వేజ్ రసూల్, ఆశిష్ నెహ్రా, యుజవేంద్ర చాహాల్, జస్‌ప్రీత్ బుమ్రా, మన్దీప్ సింగ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్) , భువనేశ్వర్ కుమార్, అమిత్ మిశ్రా.

ఇంగ్లాండ్: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), జాసన్ రాయ్, సామ్ బిలింగ్స్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (వికెట్కీపర్), మొయిన్ ఆలీ, క్రిస్ జోర్డాన్, లియం ప్లున్కేట్, ఆదిల్ రషీద్, తైమాల్ మిల్స్, జోనాథన్ బెయిర్స్టో, జేక్ బాల్, లియం డాసన్, డేవిడ్ విల్లీ.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+