Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ లో ఆడాకే.. దానిపై ఫోకస్.. : కోహ్లి చెప్పిన సక్సెస్ మంత్ర

న్యూఢిల్లీ : క్రీడాకారులన్నాక ఫిట్ నెస్ మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిందే. ఫిట్ నెస్ కి ప్రాధాన్యం ఇచ్చినప్పుడే ఆటలోను మెరుగైన ఫలితాలను రాబట్టగలరు. సరిగ్గా ఇదే విషయాన్ని ప్రస్తావించిన టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మొదట్లో తాను ఫిట్ నెస్ పై అంతగా దృష్టి పెట్టేవాడిని కాదని, ఎప్పుడైతే ఫిట్ నెస్ పై శ్రద్ద పెట్టానో.. అప్పటినుంచి ఫీల్డింగ్ లోను తాను పర్ఫెక్ట్ అయ్యానని చెప్పుకొచ్చాడు.

బ్యాట్స్ మెన్ గా, ఫీల్డర్ గా తన మెరుగైన ప్రదర్శన వెనుక ఫిట్ నెస్ మంత్ర ఉందని తెలిపాడు కోహ్లి. ఫిట్ నెస్ పై ఫోకస్ చేయడం వల్లే మంచి బ్యాట్స్ మెన్ నుంచి మంచి ఫీల్డర్ గాను రూపాంతరం చెందానని వివరించాడు. అయితే ఇదంతా 2012 ఐపీఎల్ తర్వాతే మొదలైందని అప్పటిదాకా అసలు ఫిట్ నెస్ ని ఏమాత్రం పట్టించుకునేవాడిని కాదన్నాడు.

Have never been as fit as I am today Kohli

ఇంకా కోహ్లి మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ ఆహారం విషయంలో ఎంత తినాలని గానీ, వర్కవుట్స్ విషయంలో గానీ ఎప్పడూ శ్రద్ద పెట్టలేదన్నాడు. ఐపీఎల్ 2012 తర్వాత శరీరానికి ఒక పద్దతి ప్రకారం వర్కవుట్స్ అలవాటు చేసి శరీరాన్ని మంచి ఆకృతికి తీసుకొచ్చుకున్నట్టు తెలిపాడు.

గతంలో తాను అంత బాగా ఫీల్డింగ్ చేయలేకపోయేవాడినని చెప్పిన కోహ్లి.. ఫిట్ నెస్ పై ఫోకస్ చేయడం ద్వారా ఆ సమస్యను అధిగమించినట్టు చెప్పాడు. ఫిట్ నెస్ వల్ల తనకు రెండో దేహం పొందినట్టయిందన్న కోహ్లి.. ఫిట్ గా ఉండాలంటే అందుకు తగ్గట్టు కసరత్తులు చేయాల్సిందేనని వెల్లడించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+