హార్ధిక్ పాండ్యా ప్రేమలో కొత్త రూటు, మళ్లీ బాలీవుడ్ పైనే టార్గెట్

హైదరాబాద్: సినిమా రంగానికి క్రికెట్‌కు చాలా కాలంగా సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ భామ అనుష్క శర్మల మధ్య మొదలైన ప్రేమాయణం పెళ్లి వరకు వెళ్లింది. ఇక ఇటీవల నటి నిధి అగర్వాల్- క్రికెటర్ కేఎల్ రాహుల్‌లపై వదంతులు రాగా, తాము కేవలం స్నేహితులమేనని.. ఎప్పటినుంచో తమకు పరిచయం ఉందని స్పష్టం చేశారు. ఇంతకుముందు ఓ బాలీవుడ్ భామను వెంటేసుకుని మీడియా కంటపడిన హార్ధిక్ పాండ్యా హేట్ స్టోరీ 4' నటి ఊర్వశి రౌతెలాతో మళ్లీ మెరిశాడు.

నటి ఎల్లీ అవ్రమ్‌తో రిలేషన్‌లో ఉన్నట్టు
దీంతో ఆమెతో ప్రేమాయణం నడుపుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. హార్ధిక్ పాండ్యా బాలీవుడ్ భామ పరిణితి చోప్రా, నటి ఎల్లీ అవ్రమ్‌తో రిలేషన్‌లో ఉన్నట్టు అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో పరిణితి చోప్రా తన ట్విట్టర్‌లో పెట్టిన ఓ పోస్ట్‌కి హార్ధిక్ పాండ్యా బాలీవుడ్-క్రికెట్ లింక్ అయి ఉంటుంది అనే కామెంట్ పెట్టాడు. దీంతో ఇద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందని పుకార్లు పుట్టించారు. దీనిపై స్పందించిన పరిణితీ అలాంటిదేమి లేదంటూ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది.

నేనెప్పుడూ వదంతులపై స్పందించలే
ఇక హార్ధిక్ సోదరుడు కృనాల్ పాండ్యా వివాహ వేడుకలో బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రమ్ ప్రత్యక్షం కావడం, హార్ధిక్- ఎల్లీల ఫోటోలు వైరల్ కావడంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందని అన్నారు.ఈ విషయంపై ఘాటుగానే స్పందించింది ఎల్లీ. గత కొన్నేళ్లుగా నాపై ఎన్నో తప్పుడు వార్తలు వచ్చాయి. ఆ వదంతులపై నేనెప్పుడూ స్పందించలేదు. ఎవరేమన్నా అనుకోని, వాటన్నింటిపై వివరణ ఇచ్చుకుంటూ పోలేను కదా అని అన్నారు.

ఊర్వశీ రౌతెలాతో డేటింగ్‌లో ఉన్నట్టు పుకార్లు
హార్ధిక్ పాండ్యా ప్రస్తుతం 2015లో మిస్ వరల్డ్ కోసం పోటి పడిన ఊర్వశీ రౌతెలాతో డేటింగ్‌లో ఉన్నట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి. ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ' , భాగ్ జానీ, హేట్ స్టోరీ వంటి చిత్రాలలోను నటించి పాపులర్ అయింది ఊర్వశీ . తాజాగా అండమాన్ నికోబార్ ఐలాండ్ ప్రభుత్వం ఈ అమ్మడికి ప్రత్యేక గౌరవాన్ని అందించింది. ఐలాండ్‌లోని ఓ పుష్పానికి ఊర్వశీ రౌతెలా పేరు పెట్టింది. ఊర్వశీ ఫ్లవర్స్ అంటూ వాటిని పిలుస్తారంటూ ప్రకటించింది.

సింఘానియా పార్టీలో హార్ధిక్ పాండ్యా, ఊర్వశిని:
పారిశ్రామికవేత్త గౌతం సింఘానియా పార్టీలో హార్ధిక్ పాండ్యా, ఊర్వశి కలుసుకున్నారు. అప్పటినుంచీ వీరి రిలేషన్ మొదలుకావడంతో ఎల్లీ అవ్రామ్, పాండ్యా నుంచి దూరంగా ఉందంటూ ఊహాగానాలు వస్తున్నాయి. ఇటీవల హార్ధిక్- ఊర్వశీ ఫోటోలు వైరల్ కావడంతో వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందనే అభిప్రాయానికి వస్తున్నారు నెటిజన్స్. మరి తాజా వార్తలపై క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications