Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హ్యాట్రిక్ హీరో ష‌మీకి మ‌ళ్లీ మొండిచెయ్యి: పాకిస్తానోళ్ల నోటికి మ‌ళ్లీ పని ప‌డిన‌ట్టే!

ICC Cricket World Cup 2019 : Omission Of Shami From Playing XI Surprises All || Oneindia Telugu
Hat-Trick Man Mohammed Shami Not Part of India Playing XI vs New Zealand

మాంచెస్ట‌ర్‌: ప్ర‌పంచ‌క‌ప్ హ్యాట్రిక్ హీరో మ‌హ‌మ్మ‌ద్ ష‌మీకి మ‌ళ్లీ నిరాశే ఎదురైంది. తొలి సెమీఫైన‌ల్ మ్యాచ్‌లోనూ అత‌ణ్ని జ‌ట్టులోకి తీసుకోలేదు టీమ్ మేనేజ్‌మెంట్‌. తుది జ‌ట్టులో మ‌హ‌మ్మ‌ద్ ష‌మీని తీసుకోలేదు. అత‌ని స్థానంలో మ‌రో ఫాస్ట్ బౌల‌ర్ భువనేశ్వ‌ర్ కుమార్‌కు చోటు క‌ల్పించింది. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉన్న టీమిండియా త‌ర‌ఫున ఏకైక బౌల‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ. అత‌ణ్ని తుది జ‌ట్టులో తీసుకోక‌పోవ‌డంపై ఇప్ప‌టికే పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చెల‌రేగుతున్నాయి. అయిన‌ప్పటికీ.. వాటిని పెడ‌చెవిన పెట్టింది. ఏ మాత్రం ప‌ట్టించుకోలేదు. మ‌హమ్మ‌ద్ ష‌మీ స్థానంలో భువ‌నేశ్వ‌ర్ కుమార్‌ను తుది జ‌ట్టులోకి తీసుకుంది.

కుదురుగా బౌలింగ్ చేసినా..

కుదురుగా బౌలింగ్ చేసినా..

ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో ఇప్ప‌టిదాకా మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. అద్భుతంగా రాణించాడు. భువ‌నేశ్వ‌ర్ కుమార్ కాలి కండ‌రాలు ప‌ట్టేయ‌డం వ‌ల్ల మ్యాచ్‌ల‌కు దూరం అయిన‌ప్ప‌టికీ.. ఆ లోటు క‌నిపించ‌నివ్వ‌లేదు ష‌మీ. చ‌క్క‌గా, కుదురుగా బౌలింగ్ చేశాడు. ఆఫ్ఘ‌నిస్తాన్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్ సైతం న‌మోదు చేశాడు. ఆ మ్యాచ్‌లో గెలుపు దిశ‌గా దూసుకెళ్తున్న ఆఫ్ఘ‌నిస్తాన్ బ్యాట్స్‌మెన్ల‌కు ముకుతాడు వేశాడు. చివ‌రి ఓవ‌ర్‌లో 16 ప‌రుగులు అవ‌స‌ర‌మైన ద‌శ‌లో హ్యాట్రిక్ తీసుకుని న‌డ్డి విర‌గ్గొట్టాడు. ఆ త‌రువాతి మ్యాచ్‌లోనూ రాణించాడు. ఇంగ్లండ్‌పై కాస్త భారీగానే ప‌రుగులు స‌మ‌ర్పించుకున్న‌ప్ప‌టికీ.. అయిదు వికెట్ల‌ను ప‌డ‌గొట్టిన చ‌రిత్ర‌నుత‌న పేరు మీద లిఖించుకున్నాడు. అయిన‌ప్ప‌టికీ- టీమ్ మేనేజ్‌మెంట్ అత‌ణ్ని దూరం పెట్టింది.

 మ‌నోళ్లు కాదు గానీ..పాకిస్తానీయులు ఎదురుదాడి..

మ‌నోళ్లు కాదు గానీ..పాకిస్తానీయులు ఎదురుదాడి..

ష‌మీని ప‌క్క‌న పెట్ట‌డాన్ని భార‌తీయ క్రికెట్ అభిమానులు పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌ట్లేదు. దీనిపై ఎక్క‌డా పెద్ద‌గా విమ‌ర్శ‌లు చేసిన సంద‌ర్భాలు కూడా లేవు. ఈ వ్య‌వ‌హారం మాత్రంపాకిస్తాన్‌లో పెద్ద దుమారాన్నే రేపుతోంది. మ‌హ‌మ్మ‌ద్ ష‌మీని ప‌క్క‌న పెట్ట‌డాన్ని పాకిస్తానీయులు ఏ మాత్రం జీర్ణించుకోలేక‌పోతున్నారు. మొన్న‌టికి మొన్నే పాకిస్తాన్ క్రికెట్ విశ్లేష‌కులు దీనికి రాజ‌కీయ రంగును సైతం పులిమిన విష‌యం తెలిసిందే. మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ ముస్లిం కావ‌డం వ‌ల్లే అత‌ణ్ని ఆడించ‌ట్లేదంటూ కొంద‌రు పాకిస్తాన్ క్రికెట్ విశ్లేష‌కులు బాహ‌టంగా విమ‌ర్శించారు.

ఏకంగా మోడీని ర‌చ్చ‌లోకి లాగిన పాక్‌ విశ్లేష‌కులు

ఏకంగా మోడీని ర‌చ్చ‌లోకి లాగిన పాక్‌ విశ్లేష‌కులు

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, బీజేపీ ఆదేశించ‌డం వ‌ల్లే ముస్లిం బౌల‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీని బీసీసీఐ ప్ర‌పంచ‌క‌ప్ మిగ‌తా మ్యాచుల్లో ఆడ‌నివ్వ‌ట్లేద‌ని అక్క‌సు వెల్ల‌గ‌క్కారు. అంత‌కుముందు- పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌల‌ర్ అబ్దుల్ ర‌జాక్ సైతం ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ముస‌ల్మాన్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ వ‌ల్లే టీమిండియా ఘ‌న విజ‌యాల‌ను సాధిస్తోంద‌ని చెప్పుకొచ్చారు. తాజాగా- మ‌రోసారి అత‌ణ్ని ప‌క్క‌న పెట్ట‌డంపై మ‌రిన్ని అనుమానాలు వ్య‌క్తమౌతాయ‌న‌డంలో సందేహాలు అక్క‌ర్లేద‌నే అనుకోవ‌చ్చు. శ్రీలంక‌తో జ‌రిగిన చివ‌రి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో భువ‌నేశ్వ‌ర్ ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయాడు. 10 ఓవ‌ర్ల‌లో 73 ప‌రుగులు ఇచ్చి, ఒక్క వికెట్ కూడా ప‌డ‌గొట్ట‌లేక‌పోయాడు. అయిన‌ప్ప‌టికీ.. ష‌మీని కాద‌ని భువిని తుది జ‌ట్టులోకి తీసుకోవ‌డం వ‌ల్ల విమ‌ర్శ‌ల జ‌డివాన‌ను టీమిండియా మేనేజ్‌మెంట్ ఎదుర్కోవాల్సి రావ‌చ్చు.

Story first published: Tuesday, July 9, 2019, 16:49 [IST]
Other articles published on Jul 9, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+