షమీ బండారం: టిక్‌టాక్ అకౌంట్ నిండా వాళ్లే: లఫంగా గాడు, అమ్మాయిలంటే పిచ్చి: భార్య నిప్పులు!

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ప్రపంచకప్‌లో ప్రత్యర్థి జట్లపై నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడుతుంటే- ఆయన భార్య హసీన్ జహా మాత్రం దీనికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఈ ఫాస్ట్ బౌలర్‌నే టార్గెట్‌గా చేసుకుని బౌన్సర్లు సంధిస్తున్నారు. గుక్క తిప్పుకోనీయకుండా ఆరోపణలు చేస్తున్నారు. షమీ బండారం ఇదేనని అంటూ కొన్ని ఫొటోలను ఆమె తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. షమీ ఇటీవలే టిక్ టాక్ అకౌంట్ ఓపెన్ చేశాడని, దాన్ని చూస్తే అందులో కనిపించవాటిని చూసి బిత్తరపోయానని అన్నారు. మహమ్మద్ షమీ ఓ పెద్ద లఫంగా అని, సిగ్గు లేని వాడని కఠిన పదాలతో తిట్టిపోశారు.

లఫంగా గాడు..ఆడోళ్లంటే పిచ్చి
మహమ్మద్ షమీని పెద్ద లఫంగా గాడు అంటూ కామెంట్ చేశారామె. అతనికి ఆడవాళ్లంటే పిచ్చి అని, పెద్ద విమెనైజర్ అని తిట్టిపోశారు. మహమ్మద్ షమీ ఇటీవలే టిక్ టాక్ అకౌంట్ తెరిచాడట. అందులో 10 కాదు.. 20 కాదు..ఏకంగా 90 మంది ఆడవాళ్లను అతను అనుసరిస్తున్నాడని హసీన్ జహా చెబుతున్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలను ఆమె తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. వాటిని షేర్ చేశారు. ఇదీ మహమ్మద్ షమీ అసలు బండారం అంటూ రాసుకొచ్చారు. రెండురోజుల కిందట తాను అతని టిక్ టాక్ అకౌంట్‌ను తెరిచి చూడగా మొత్తం 97 మందిని షమీ ఫాలో అవుతున్నారని, ఇందులో 90 మంది ఆడవాళ్లేనని అన్నారు. వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్లను ఆమె తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఓ కుమార్తెకు తండ్రిగా ఉంటూ అమ్మాయిలు అంటే పడి చచ్చే షమీ ఓ షేమ్ లెస్ అని విమర్శించారు. ఏ మాత్రం సిగ్గు అనేదే లేదని.. ఛీ ఛీ అంటూ చీదరించుకున్నారు.

హసీన్ జహా.. షమీ వేర్వేరుగా..
సుమారు రెండేళ్లుగా మహమ్మద్ షమీ అతని భార్య హసీన్ జహా వేర్వేరుగా కాపురం ఉంటున్న విషయం తెలిసిందే. షమీకి అమ్మాయిల పిచ్చి ఎక్కువని, చాలామందితో అతను అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఆరోపించారు. అదనపు కట్నం కోసం షమీ, అతని తల్లి తనను చిత్రహింసలకు గురి చేశారని, వాటిని తట్టుకోలేక మెట్టినింటి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పుకొచ్చారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం రేపింది. హసీన్ జహా గృహ హింస చట్ట కింద షమీపై కేసు సైతం నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.

షమీపై ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు..
హసీన్ జహా ఫిర్యాదు ఫిర్యాదు చేయడంతో జాదవ్ పూర్ పోలీసులు మహమ్మద్ షమీతో పాటు నలుగురు కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేశారు. మొత్తం ఏడు సెక్షన్ల కింద జాదవ్ పూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఐపీసీ 498ఏ, 323,307, 506, 328, 34 సెక్షన్ల ప్రకారం షమీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును లాల్‌బజార్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన డిటెక్టివ్ విభాగంతోపాటు ఉమెన్స్ గ్రీవెన్స్‌సెల్ షమీ కేసును దర్యాప్తు చేయనున్నారు. షమీ మోసగాడని, అతనికి పలువురితో వివాహేతర సంబంధాలున్నాయని, తనపై గృహసింహకు పాల్పడడంతోపాటు చంపేందుకు ప్రయత్నించారని షమి భార్య హసీన్ జహా ఆరోపించిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications