'టిఫిన్‌తో మొదలై పడకగదితో ముగించారు'

హైదరాబాద్: వివాహేతర ఆరోపణ నుంచి అతని కెరీర్ వరకు ముడిపెట్టిన హసీన్ జహాన్ మళ్లీ తాజాగా మీడియా ముందుకొచ్చింది. 'ఆమె కేవలం అతని అభిమాని కాదు. ప్రేయసి అయినా అయి ఉండాలి. లేదా వ్యభిచారైనా అయి ఉండాలి' అంటూ నిప్పులు చెరుగుతోంది హసీన్. ముందుగా అతను దుబాయ్ లో పాకిస్థాన్ మహిళను కలిశాడంటూ చేసిన ఆరోపణకు స్పందించిన పాకిస్థాన్ మహిళ ఇలా పేర్కొంది.

ఒక్క అల్పాహారం కోసమే :
తాను షమి అభిమానిని మాత్రమేనని, అతడితో అల్పాహారం చేయడానికే హోటల్‌కు మాత్రమే వెళ్లానని చెప్పింది. ఐతే సదరు మహిళ అలీష్‌బా చెబుతుందంతా అబద్ధమని తాజాగా హసీన్ వ్యాఖ్యానించింది. ఆమె అల్పాహారం కోసమే అతణ్ని కలవలేదని, వారి కలయిక చివరికి పడకపై ముగిసిందని అంది.

ఆమె ఓ వ్యభిచారి:
‘‘ఆమె షమి అభిమాని కాదు. ఆమె అతడి ప్రేయసి కావొచ్చు లేదా వ్యభిచారి కావొచ్చు. ఒక అమ్మాయి కుటుంబానికి తెలియకుండా ఒక మగాణ్ని రహస్యంగా కలుస్తోందంటే అర్థమేంటి? అలిష్బా నా వైవాహిక జీవితాన్ని నాశనం చేయడానికే వచ్చింది. నా భర్త కూడా అమాయకుడు కాదు' అని తెలిపింది.

తప్పు చేయడానికే దుబాయ్‌లో :
'షమితో అలీష్‌బాకు సంబంధముందని ఇంతకుముందే చాలా సార్లు చెప్పాను. తప్పు చేయడానికే వాళ్లు దుబాయ్‌లో కలిశారు. ఇలా కలవాలని వాళ్లు జనవరి నుంచే అనుకుంటున్నారు. వాళ్ల కలయిక అల్పాహారానికే పరిమితమా? కాదు.. అది చివరికి బెడ్ రూమ్‌లో ముగిసింది' అని హసీన్ విలేకర్ల ముందు చెప్పింది.

వెంటనే అరెస్ట్ చేయాలని:
షమిని, అతడి కుటుంబాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేసింది. ఇన్నాళ్లు కలిసి ఉండటానికి సమ్మతమే అని పేర్కొన్న ఆమె.. ఇప్పుడు షమిని నడిరోడ్డుపై కొట్టాలని అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications