Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Hasin Jahan: చంపడానికి క్రిమినల్స్‌కు డబ్బులిచ్చాడు.. షమీపై తీవ్ర ఆరోపణలు

Mohammed Shami-Hasin Jahan: భారత క్రికెటర్ మహ్మద్ షమీ, ఆయన భార్య హసీన్ జహాన్ మధ్య ఏడేళ్లుగా కోర్టులో ఉన్న కేసుపై ఇటీవల కోల్‌కతా హైకోర్టు కీలక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. కోల్‌కతా హైకోర్టు మహ్మద్ షమీకి తన భార్య, కుమార్తె ఐరా ఖర్చుల కోసం ప్రతినెల రూ.4 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తం గత ఏడేళ్లుగా చెల్లించాల్సిన బకాయిలకు కూడా వర్తిస్తుంది. ఈ తీర్పు వచ్చిన తర్వాత హసీన్ జహాన్ తన భర్త కోసం వరుసగా సోషల్ మీడియా పోస్టులు చేస్తోంది. ఈ నేపథ్యంలో షమీని విమర్శిస్తూ హసీన్ జహాన్ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఆ సుదీర్ఘ పోస్టులో షమీపై అతడి మాజీ భార్య హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేశారు. మహ్మద్ షమీకి వ్యక్తిత్వం లేదని.. తన క్రూరమైన మనస్తత్వంతో ఎంతగానో వేధించినట్లు ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.

గత ఏడేళ్లుగా ఈ న్యాయపోరాటం జరుగుతోందని హసీన్ జహాన్ పేర్కొన్నారు. షమీ క్యారెక్టర్ లేనితనం, దురాశ, క్రూరమైన మనస్తత్వం కారణంగా సొంత కుటుంబం నాశనమైందని ఆమె చెప్పుకొచ్చారు. " మమ్మల్ని చంపడానికి మీరు ఎంతమంది క్రిమినల్స్‌ను కొన్నారు? ఆ డబ్బును మన కుమార్తె చదువుపై, నాకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఖర్చు చేసి ఉంటే, ఇప్పుడు మన జీవితం ఎంతో బాగుండేది. ఎంతో గౌరవంగా జీవించేవాళ్లం." అని హసీన్ జహాన్ రాసుకొచ్చారు. నిజం కోసం తాను ఏళ్ల తరబడి పోరాడుతూనే ఉన్నానని.. నువ్వు(షమీ) ఎంతమంది క్రిమినల్స్‌తో చేతులు కలిపినా ఏమీ చేయలేకపోతున్నావని అన్నారు.

Hasin Jahan Levels Serious Allegations Against Mohammed Shami After Court Verdict

హసీన్ జహాన్ తన పోస్ట్‌లో ఏమి రాసిందంటే?
మహ్మద్ షమీ కోసం తన పోస్ట్‌ను షేర్ చేస్తూ హసీన్ జహాన్ ఇలా రాసింది, "ఐ లవ్ యూ జాను... నా లాంటి భార్య ఇంకెక్కడైనా దొరుకుతుందా? ఇంతటి అంకితభావంతో బంధాన్ని నిలబెట్టుకునే భార్య? చింతించకు మై లవ్, చనిపోయే వరకు మనం బలమైన బంధాన్ని నిలబెట్టుకుందాం, ఇన్షాఅల్లాహ్. ఆ బలమైన బంధం ఎలా ఉండాలో మీరు మాత్రమే నిర్ణయించుకోవాలి. ఏడేళ్లుగా మనం చట్టపరమైన పోరాటంలో ఉన్నాం. మీకు ఏమి ప్రయోజనం చేకూరింది? నైతికత లేని, అత్యాశపరుడైన, స్వార్థపరుడైన కారణంగా మీరు మీ సొంత కుటుంబాన్ని నాశనం చేసుకున్నారు." హసీన్ జహాన్ ఇక్కడితో ఆగకుండా, మహ్మద్ షమీపై ఒకదాని తర్వాత ఒకటి అనేక ఆరోపణలు చేసింది.

హసీన్ జహాన్ ఎవరు?
హసీన్ జహాన్ భారత క్రికెటర్ మహ్మద్ షమీ భార్య. హసీన్ జహాన్ వృత్తిరీత్యా మోడల్, కోల్‌కతా నైట్ రైడర్స్ కోసం చీర్ లీడర్‌గా కూడా పని చేసింది. హసీన్ జహాన్ తన ఫిట్‌నెస్‌పై కూడా చాలా శ్రద్ధ చూపుతుంది. సోషల్ మీడియాలో చాలా మంది హసీన్ జహాన్ ను ఫాలో అవుతారు. మహ్మద్ షమీతో వివాదం కారణంగా హసీన్ జహాన్ చాలా కాలంగా తన కుమార్తెతో విడిగా నివసిస్తోంది. వీరిద్దరి మధ్య వివాదం చాలా కాలంగా నడుస్తోంది. వీరిద్దరికీ ఇంకా విడాకులు కాలేదు.

Story first published: Saturday, July 5, 2025, 12:33 [IST]
Other articles published on Jul 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+