హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా ఆదివారం గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాడు హషీం ఆమ్లా మరో సెంచరీని నమోదు చేశాడు. 60 బంతుల్లో8 ఫోర్లు, 5 సిక్సర్లు సాయంతో 104 పరుగులు చేశాడు. తద్వారా ఈ ఐపీఎల్లో రెండో సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
అంతకముందు ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఆమ్లా సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఆమ్లా సెంచరీ చేసిన రెండు సందర్భాల్లో పంజాబ్ జట్టు విజయం సాధించలేదు. గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమ్లా (60 బంతుల్లో 104; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ సాధించాడు.
అయితే చెత్త ఫీల్డింగ్‌తో పంజాబ్ ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైంది. దీంతో ఆమ్లా సెంచరీ వృధాగా పోయింది. ఇక, అంతకుముందు ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఆమ్లా సెంచరీ సాధించాడు. 8 ఫోర్లు, 12 సిక్సర్లతో 104 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తన శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేయడం ఆనందంగా ఉందని మ్యాచ్ అనంతరం ఆమ్లా చెప్పాడు. ప్రతి ఒక్కరికి తమదైన శైలి ఉంటుందని, తాను మంచి షాట్లు కొట్టానని అన్నాడు. తమ జట్టు ప్లేఆఫ్‌కు చేరుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆమ్లా స్వదేశానికి పయనమవుతున్నాడు.
దీంతో ఐపీఎల్‌లో మిగతా మూడు ఐపీఎల్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. ఈ సీజన్‌లో అతడు 10 మ్యాచులు ఆడిన ఆమ్లా 420 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి.