Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ మరో రికార్డుని బద్దలు కొట్టిన హషీమ్ ఆమ్లా

హైదరాబాద్: కింబర్లీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా క్రికెటర్ హాషీమ్ ఆమ్లా అరుదైన ఘనత సాధించాడు. గతంలో కోహ్లీ నెలకొల్పిన ఫాస్టెస్ట్ 7000 పరుగుల రికార్డును బ్రేక్ చేసిన ఆమ్లా తాజాగా సెంచరీల విషయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నెలకొల్పిన రికార్డుని బద్దలు కొట్టాడు.

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో హషీమ్ ఆమ్లా 112 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 110 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో తన కెరీర్‌లో 26వ వన్డే సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఇక్కడ కోహ్లీ రికార్డుని బద్దలు ఎక్కడ బద్దలు కొట్టాడని అనుకుంటున్నారా?

154 ఇన్నింగ్స్‌ల్లో 26వ సెంచరీని నమోదు చేసిన ఆమ్లా

154 ఇన్నింగ్స్‌ల్లో 26వ సెంచరీని నమోదు చేసిన ఆమ్లా

హషీమ్ ఆమ్లా 154 ఇన్నింగ్స్‌ల్లోనే 26 సెంచరీలు నమోదు చేయగా... కోహ్లీ 26 సెంచరీలు సాధించేందుకు గాను 166 ఇన్నింగ్స్‌లు తీసుకోవడం విశేషం. ఇదిలా ఉంటే ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

 అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన జట్టుగా దక్షిణాఫ్రికా రికార్డు

అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన జట్టుగా దక్షిణాఫ్రికా రికార్డు

తద్వారా సఫారీ జట్టు ఓ రికార్డుని కూడా తన ఖాతాలో వేసుకుంది. వన్డే క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని (వికెట్లపరంగా) నమోదు చేసిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. డైమండ్ ఓవల్ స్టేడియంలో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఏడు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది.

సఫారీలపై సెంచరీ చేసిన తొలి బంగ్లా ఆటగాడిగా

సఫారీలపై సెంచరీ చేసిన తొలి బంగ్లా ఆటగాడిగా

ఈ మ్యాచ్‌లో ముష్ఫికర్ రహ్మాన్ (110 నాటౌట్‌; 116 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సుల)తో సెంచరీ నమోదు చేశాడు. తద్వారా సఫారీలపై సెంచరీ చేసిన తొలి బంగ్లా ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అనంతరం 279 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఒక వికెట్ కూడా నష్టపోకుండా 42.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది.

మూడు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యం

మూడు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యం

దక్షిణాఫ్రికా ఓపెనర్లు డికాక్‌ (168 నాటౌట్‌), ఆమ్లా (110 నాటౌట్‌)తో రాణించారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యం సాధించింది.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+