న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టిన ఆమ్లా: సింహాలతో జడెజా ఫోటో, చిక్కులు

న్యూఢిల్లీ: సౌతాప్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. బుధవారం నాడు వెస్టిండీస్ - సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో హషీమ్ ఆమ్లా తక్కువ మ్యాచుల్లోనే తన 23వ సెంచరీని పూర్తి చేశాడు.

ముక్కోణపు సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆమ్లా కెరీర్‌లో 23వ శతకం బాది దక్షిణాఫ్రికాను గెలిపించాడు. మొత్తం 135 వన్డేలాడిన ఆమ్లా 132 ఇన్నింగ్స్‌ల్లోనే 23 శతకాల మైలురాయిని చేరుకున్నాడు.

అంతక ముందు ఈ ఘనతను విరాట్‌ కోహ్లి అందుకున్నాడు. కోహ్లీ 157 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయి అందుకున్నాడు. భారత దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ టెండుల్కర్‌ 214 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు.

 Hashim Amla breaks another Virat Kohli record, becomes fastest to 23 ODI tons

సింహాలతో ఫోటో దిగి చిక్కుల్లో పడ్డ జడెజా

క్రికెటర్‌ రవీంద్ర జడేజా పడ్డాడు! గుజరాత్‌లోని సాసన్‌ గిర్‌ అభయారణ్య పర్యటనకు వెళ్లిన జడేజా దంపతులు వాహనం దిగి తమ వెనుక సింహాలు కనిపించేలా సెల్ఫీలు, ఫొటోలు తీసుకోవడం వివాదాస్పదమవుతోంది.

గుజరాత్‌ అటవీ శాఖ నిబంధనల ప్రకారం గిర్‌ అటవీ ప్రాంతంలో సఫారీకి వెళ్లే పర్యటకులు వాహనాల నుంచి కిందకు దిగకూడదు. జడేజా నిబంధనలు అతిక్రమించినట్లు ఫొటోల ద్వారా తెలుస్తోంది. ఈ ఫొటోల్లో అటవీ శాఖ సిబ్బంది కూడా జడేజాతో కలిసి ఉన్నారు. దీనిపై గుజరాత్‌ అటవీ శాఖ విచారణకు ఆదేశించింది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X