కోచ్‌గా సాయం చేయవా?: లంక బ్యాటింగ్ కోచ్‌గా తిలకరత్నే
హైదరాబాద్: సొంతగడ్డపై బుధవారం నుంచి జరిగే మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో కోహ్లీసేనకు గట్టి పోటీ ఇవ్వాలని శ్రీలంక భావిస్తోంది. ఇందులో భాగంగా శ్రీలంకకి 2003-04లో కెప్టెన్‌గా ఉన్న తిలకరత్నేని బ్యాటింగ్ కోచ్‌గా నియమిస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
ఇటీవల జింబాబ్వేతో ముగిసిన వన్డే సిరీస్, ఏకైక టెస్టులో ఆ జట్టు ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. ఐదు వన్డేల సిరీస్‌ని జింబాబ్వే 3-2తో కైవసం చేసుకోగా, ఏకైక టెస్టులో కూడా శ్రీలంక దాదాపు ఓటమి అంచు వరకూ వెళ్లింది. అయితే చివర్లో బౌలర్లు సత్తా చాటడంతో టెస్టు నెగ్గింది.

భారత్‌కు గట్టి పోటీ
ఈ నేపథ్యంలో భారత్‌తో జరిగే మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో గట్టి పోటీ ఇవ్వడంతో పాటు బ్యాటింగ్‌లో మెరుగవ్వాలని శ్రీలంక భావిస్తోంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో లంక చెత్త ప్రదర్శనకు గాను ఆ జట్టు కోచ్ గ్రాహాం ఫోర్డ్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

83 టెస్టులాడిన తిలకరత్నే 4545 పరుగులు
అప్పటి నుంచి శ్రీలంక జట్టు కోచ్ లేకుండానే ఉంది. ఈ నేపథ్యంలో తిలకరత్నేని బ్యాటింగ్ కోచ్‌గా నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. అతడి రాక జట్టుకు మరింత బలాన్ని చేకూరుస్తుందని శ్రీలంక క్రికెట్ మేనేజర్ అసంక గురుసింహా తెలిపాడు. తన కెరీర్‌లో మొత్తం 83 టెస్టులాడిన తిలకరత్నే 4545 పరుగులు చేశాడు.

శ్రీలంక తొలి క్రికెటర్‌గా రికార్డు
దక్షిణాఫ్రికాలో సెంచరీ చేసిన శ్రీలంక తొలి క్రికెటర్‌గా రికార్డుల్లో సృష్టించాడు. 1996 శ్రీలంక వరల్డ్ కప్ గెలిచిన జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. 21 ఏళ్ల పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన తిలకరత్నే 49.26 యావరేజితో 13,253 పరుగులు చేశాడు. జులై 26 (బుధవారం) నుంచి గాలే వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది.

బౌలింగ్ కోచ్‌గా చమింద వాస్
దీంతో భారత పేసర్లని ఎదుర్కొనేందుకు శ్రీలంక బ్యాట్స్‌మెన్‌కి సాయం చేయాల్సిందిగా బోర్డు కోరింది. ఇప్పటికే గాలే స్టేడియానికి చేరుకున్న తిలకరత్నే.. బ్యాట్స్‌మెన్‌కి ట్రైనింగ్ సెషన్స్ నిర్వహించాడు. ఇటీవలే తన స్వింగ్ బౌలింగ్‌తో లంకకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు కట్టబెట్టిన చమింద వాస్‌ను భారత్‌తో సిరీస్‌కు గాను బౌలింగ్ కోచ్‌గా నియమించుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications