Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శ్రీలంక క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్, అపకపోతే పాక్‌లా అవుతాం: తిలకరత్నే

Hashan Tillakaratne
కోలంబో: చాలా కాలంగా తమ దేశ క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ సర్వసాధారణంగా మారిందని శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ హసన్ తిలకరత్నే సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రపంచ కప్ పోటీల పైనల్ మ్యాచుకు నలుగురు క్రికెటర్లను ఎందుకు మార్చారని ఆయన అడిగారు. మ్యాచ్ ఫిక్సింగ్‌ను నిరోధించకపోతే తమ దేశ క్రికెట్ కూడా పాకిస్తాన్ క్రికెట్ మాదిరిగా తయారవుతుందని ఆయన అన్నారు.

1992 నుంచి మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతోందని, ఇందుకు సంబంధించిన పేర్లను తాను వెల్లడిస్తానని ఆయన చెప్పారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఈ రోజో నిన్ననో మొదలు కాలేదని, 1992 నుంచి ఉన్నదేనని, తాను ఈ ప్రకటన బాధ్యతతో చేస్తున్నానని ఆయన అన్నారు. డబ్బులు ముట్టజెప్పడం ద్వారా మ్యాచ్ ఫిక్సింగ్ సంఘటనలు బయటకు రాకుండా చూశారని ఆయన అన్నారు.

ఎవరో ఒక్కరు జోక్యం చేసకుని ఈ మ్యాచ్ ఫిక్సింగ్ భూతాన్ని అరికట్టకపోతే రెండు మూడేళ్లలో ఈ దేశం రాజకీయాలతో, అవినీతి యంత్రాంగంతో మరో పాకిస్తాన్ కావడం ఖాయమని ఆయన అన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్‌కు ఓ వ్యవస్థ ఉందని, దాని నుంచి ఎవరూ బయటపడలేరని ఆయన అన్నారు. ఆటగాళ్ల నోళ్లు మూయించేందుకు డబ్బులు ముట్టజెప్పారని ఆయన అన్నారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+