For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Virat Kohli: కోహ్లి నాన్‌ వెజిటేరియన్‌గా మారిపోయాడా? నెట్టింట్లో రచ్చ

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఫిట్‌నెస్ గురించి అందరికీ తెలిసిందే. భారత క్రికెట్‌కు ఫిట్‌నెస్ సంప్రదాయాన్ని తీసుకువచ్చిన ఆద్యుడిగా కోహ్లిని కొనియాడుతుంటారు. అంతలా కీర్తి సంపాదించుకోవడం వెనుక కోహ్లి కఠోర శ్రమ దాగి ఉంది. ఇక విరాట్ శాకాహారి. వెన్నెముక సమస్య కారణంగా మాంసాహారాన్ని పూర్తిగా మానేశాడు.

అయితే ఇప్పుడు కోహ్లి వెజిటేరియనా లేదా నాన్ వెజిటేరియనా అని నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దానికి కారణం విరాట్ కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీని పోస్ట్ చేయడమే. 'మాక్ చికెన్ టిక్కాను కచ్చితంగా ఇష్టపడతారు' అంటూ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఆ తర్వాత నెట్టింట్లో రచ్చ మొదలైంది.

Has Virat Kohli turned non-vegetarian? Discussion in Social media

శాకాహారి అయిన కోహ్లి చికెన్ ఎలా తింటాడని, కోహ్లి నాన్‌వెజిటేరియన్ గా మారిపోయాడంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఓ నెటిజన్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. మాక్ చికెన్ టిక్కాను చికెన్‌తో చేయరని, సోయాను ఉపయోగించి తయారు చేస్తారని, కానీ లుక్ అండ్ టేస్ట్ చికెన్ లానే ఉంటుందని వివరించాడు. గతంలో కూడా కోహ్లి ఇది చాలా సార్లు తిన్నాడని తెలిపాడు.

కాగా, వన్డే వరల్డ్ కప్ తర్వాత కోహ్లి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో సమయాన్ని గడుపుతున్నాడు. డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్ కోసం మరికొన్ని రోజుల్లో సఫారీ గడ్డకు కోహ్లి వెళ్లనున్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనున్న విషయం తెలిసిందే.

అయితే ఇటీవల కోహ్లి గూగుల్ ఆల్ టైమ్ రికార్డును సాధించాడు. గూగుల్ ఆల్ టైమ్‌లో అత్యధిక సార్లు వెతికిన క్రికెటర్ విరాట్ కోహ్లి అని గూగుల్ ఇటీవల ప్రకటించింది.

Story first published: Wednesday, December 13, 2023, 16:04 [IST]
Other articles published on Dec 13, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+