Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రవిశాస్త్రి పొగుడుతున్నాడా... తూలనాడుతున్నాడా..?

Has coach Ravi Shastri insulted past Indian teams and greats?

హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఘాటు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. భారత్ జట్టుకు ప్రధాన కోచ్ గా వ్యవహరిస్తోన్న రవిశాస్త్రి కోహ్లీ సేనను తెగపొగిడేస్తున్నాడు. ఆ పొగడ్తలే ఇప్పుడు కాస్త హద్దు దాటినట్లు కనిపిస్తున్నాయి.

టీమిండియా ప్రధాన కోచ్ భారత్ శ్రీలంకకు ఆదివారం ఆఖరి వన్డే జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లోనే కాదు సిరీస్ లోనూ భారత్ ఘనవిజయం సాధించడంతో జట్టు ప్రధాన కోచ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "కోహ్లీ వ్యక్తిత్వానికి నాకూ చాలా సామీప్యత ఉంది. మేము మైదానంలోకి గెలవాలనే కసితో దిగుతాం. టీం అంతా ఖచ్చితంగా గెలవాలనే ఆడతాం. టీం అంటే జట్టులో మనుషులు నిండడం కాదు. టైంపాస్ గా ఆడే టీం కాదు మాది" అన్నాడు.

రవిశాస్త్రి మాటలని బట్టి చూస్తే అంతకుముందు ఆడిన లెజెండ్‌లు అందరూ మైదానంలో అడుగుపెట్టింది గెలవడానికి కాదేమో అతనికే తెలియాలి. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ డ్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ వీళ్లందరూ టైంపాస్‌కే ఆడేవాళ్లేమో అతనే చెప్పాలి.

పోనీ, అలా కాదనకుంటే టైంపాస్ ఆడే టీం ఏదైనా ఉందా..అలాంటి ఆటగాళ్లు ఎవరైనా ఉన్నారా అనేది కూడా రవిశాస్త్రి మాటల్లోనే వింటే బావుంటుందని పలువురి అభిప్రాయం.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, December 18, 2017, 12:38 [IST]
Other articles published on Dec 18, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+