Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: నితీశ్‌ కాదు..జట్టులోకి మరో పేస్ ఆల్‌రౌండర్- గంభీర్ మాస్టర్ ప్లాన్

స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలో భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే టెస్టు సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. సొంతగడ్డపై టెస్టు సిరీస్‌ను చేజార్చుకోవడం పుష్కరకాలం తర్వాత ఇదే తొలిసారి. అయితే కివీస్‌తో సిరీస్ అనంతరం క్రికెట్ అభిమానులు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరల్ట్ టెస్టు ఛాంపియన్‌‌షిప్ ఫైనల్స్‌కు చేరాలంటే ఈ ట్రోఫీ టీమిండియాకు ఎంతో అవసరం.

ఈ క్రమంలో ఆస్ట్రేలియా పర్యటనకు వ్యూహాత్మకంగా భారత జట్టును ప్రకటించారు. సీనియర్లు పుజారా, రహానెలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్‌లు వినిపిస్తున్నా, యువ ఆటగాళ్లకు పెద్దపీట వేశారు. నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అభిమన్యు ఈశ్వరన్‌ వంటి యువ ప్లేయర్లు తొలిసారి టెస్టు జట్టుకు ఎంపికయ్యారు. పేస్ ఆల్‌రౌండర్‌గా తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి జట్టులో చోటు దక్కించుకున్నాడు.

Harshit Rana Validates Gambhir s Bold Call with Ranji Five-For Fifty Ahead of Border-Gavaskar Trophy

అయితే పేస్ ఆల్‌రౌండర్‌గా నితీశ్ రెడ్డి ఒక్కడే జట్టులో ఎంపిక కాలేదు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో సత్తాచాటుతాడనే కోణంలో హర్షిత్ రాణాను కూడా గంభీర్ జట్టులోకి ఎంపిక చేశాడు. దులీప్ ట్రోఫీలో టాలెండర్‌గా వచ్చి సిక్సర్లు మోత మోగించిన హర్షిత్‌ను కేవలం బౌలర్‌గా మాత్రమే జట్టులో చోటు కల్పించలేదు. కాగా, గంభీర్‌ నమ్మకాన్ని హర్షిత్ రంజీ ట్రోఫీలో నిలబెట్టాడు.

అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో హర్షిత్ రాణా ఢిల్లీ తరఫున అయిదు వికెట్లతో పాటు అర్ధశతకంతో మెరిశాడు. 19.3 ఓవర్లు బౌలింగ్ చేసిన హర్షిత్ 80 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇక ఢిల్లీ 182/6తో కష్టాల్లో నిలిచినప్పుడు క్రీజులోకి వచ్చిన ఈ యువ ప్లేయర్ 66 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. 4 ఫోర్లు, 2 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 6.2 అడుగుల ఎత్తు ఉండే హర్షిత్‌ 140 కిలోమీటర్ల వేగంతో బౌన్సర్లు విసురుతూ బ్యాటర్లకు సవాలు విసరగలడు.

ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్‌), యశస్వీ జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ (వికెట్ కీప‌ర్‌), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), ర‌విచంద్ర‌న్‌ అశ్విన్, ర‌వీంద్ర‌ జడేజా, మ‌హ్మ‌ద్‌ సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్‌ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.

Story first published: Monday, October 28, 2024, 20:06 [IST]
Other articles published on Oct 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+