Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs Eng Harshit Rana: ఏంటి రాణా.. మొన్న అదరగొట్టావ్.. ఇప్పుడేమో చెత్త రికార్డ్ ఇచ్చావ్

టీమిండియా - ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య నాగ్‌పూర్ వేదిక‌గా మొదలైన తొలి వ‌న్డేతో భార‌త యువ ఆట‌గాళ్లు య‌శ‌స్వి జైశ్వాల్, హ‌ర్షిత్ రాణా వన్డే అరంగేట్రం చేశారు. అయితే టీ20 సిరీస్ లో కంక‌ష‌న్ సబ్‌స్టిట్యూట్ గా అరంగేట్రం ఇచ్చి అదిరే ప్రదర్శన చేసిన హ‌ర్షిత్ రాణా.. వన్డే అరంగేట్రాన్ని మాత్రం చెత్త రికార్డుతో మొదలు పెట్టాడు. వచ్చీ రాగానే అతడు ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు.

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఆరో ఓవ‌ర్‌ ను హ‌ర్షిత్ రాణా బౌలింగ్ చేయగా.. ఈ ఓవ‌ర్‌లో ఇంగ్లాండ్ స్టార్ ఓపెన‌ర్ ఫిలిప్ సాల్ట్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఓవర్ ను ఏకంగా సిక్స్ తో ప్రారంభించాడు. మొత్తంగా ఈ ఓవర్ లో ఏకంగా మూడు సిక్స‌ర్లు, రెండు ఫోర్లు బాదేశాడు. ఈ ఓవర్ తొలి బంతిని సాల్ట్ బాదగా.. అది కీవర్ కఏల్ రాహుల్ తల మీదుగా వెళ్లింది. రెండు బంతిని కవర్ డ్రైవ్ చేయగా అది బౌండరీని టచ్ చేసింది. మూడో బంతిని హర్షిత్ రాణా ఆఫ్ స్టంప్ వెలుపల వేయగా.. సాల్ట్ మోకాలి మీద కూర్చొని బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా స్లాగ్ స్వీప్ ఆడాడు. దీంతో మళ్లీ సిక్స్ నమోదైంది. నాలుగో బంతిని లెంగ్త్ డెలీవరీ చేయగా.. దాన్ని ఫోర్ బాదాడు. ఐదోది డాట్ బాల్. ఇక ఆరోది షార్ట బాల్ వేయగా.. మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్స్ బాదాడు సాల్ట్. అలా 6, 4, 6, 4, 0, 6 బాది.. ఈ ఓవ‌ర్‌లో 26 ప‌రుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో వ‌న్డే అరంగ్రేట మ్యాచ్‌లో.. ఓ ఓవ‌ర్‌లో అత్య‌ధిక ప‌రుగులు సమర్పించుకున్న చెత్త రికార్డును హ‌ర్షిత్ ఖాతాలో వేసుకున్నాడు.

Harshit Rana ODI Debutant creates worst record by philip salt Hitting in ind vs eng 1st ODI

అయితే ఈ చెత్త రికార్డు నమోదు చేశాక హర్షిత్ రాణా గట్టి కమ్ బ్యాక్ ఇచ్చాడు. రెండో ఓవర్ లోనే రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. బెన్ డకెట్, హ్యారీ బ్రూక్ ను పెవిలియన్ పంపాడు. కాగా, గాయం కారణంగా ఛాంపియ‌న్స్ ట్రోఫీలో టీమిండియా స్టార్ పేస‌ర్ బుమ్రా ఆడే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా కనిపిస్తున్నాయి. అతడు ఆడటం అనుమానంగా మారింది. దీంతో అత‌డికి ప్ర‌త్యామ్నాయంగా హ‌ర్షిత్ కు అవకాశం ఇవ్వాలని గంభీర్ భావిస్తున్నాడట. అందుకే ఈ తొలి వ‌న్డే మ్యాచ్‌లో అత‌డికి అవకాశం ఇచ్చినట్లు తెలిసింది.

Story first published: Thursday, February 6, 2025, 15:46 [IST]
Other articles published on Feb 6, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+