ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో ఇప్పుడంతా టీమిండియా యంగ్ పేసర్ హర్షిత్ రాణా అరంగేట్రంపై తీవ్రంగా చర్చ సాగుతోంది. కంకషన్ సబ్‌స్టిట్యూట్ గా అతడు తుది జట్టులోకి వచ్చిన తీరు విమర్శలకు దారితీసింది. దీంతో అతడితో పాటు టీమిండియాపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. కంకషన్ సబ్‌స్టిట్యూట్ విషయంలో సరైన విధానం పాటించలేదంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
టీ20 ఫార్మాట్ లో తొలి ప్లేయర్ గా
విమర్శల విషయాన్ని పక్కన పెడితే.. హర్షిత్ రాణా మాత్రం వచ్చీ రాగానే ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుని ప్రపంచంలోనే తొలి ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. టీమిండియా తరఫున ఈ విధంగా అరంగేట్రం చేసిన తొలి క్రికెటర్‌గా నిలవడంతో పాటు ప్రపంచ క్రికెట్ లో టీ20 ఫార్మాట్ లో ఈ విధంగా ఎంట్రీ ఇచ్చిన తొలి ప్లేయర్ గా ఘనత సాధించాడు.

ఇప్పటివరకు టెస్ట్, వన్డేల్లోనే..
ఐసీసీ పూర్తి సభ్యత్వం ఉన్న జట్లలో ఇప్పటివరకు టెస్టు, వన్డే ఫార్మాట్ లోనే కంకషన్ సబ్‌స్టిట్యూట్ గా ప్లేయర్లు అరంగేట్రం చేశారు.మొత్తంగా ఆరుగురు క్రికెటర్లు చేశారు. ఇక ఇప్పుడు టీ20 ఫార్మాట్ లోనూ హార్షిత్ రాణా కంకషన్ సబ్ స్టిట్యూట్ గా అరంగేట్రం చేయడంతో.. అన్నీ ఫార్మాట్లలోనూ(వన్డే, టెస్ట్, టీ20)కలిపి ఈ విధంగా అరంగేట్రం చేసిన ఏడో క్రికెటర్ గా నిలిచాడు.
అన్నీ ఫార్మాట్లలో కంకషన్ సబ్ స్టిట్యూట్ గా అరంగేట్రం చేసిన ప్లేయర్ల జాబితా
బ్రియాన్(Brian Mudzinganyama) వర్సెస్ శ్రీలంకపై - హరారె 2020 (టెస్ట్ మ్యాచ్)
నెయిల్ రాక్ వర్సెస్ వెస్టిండీస్ - కింగ్ స్టన్ 2022(వన్డే మ్యాచ్)
ఖాయా జాండో వర్సెస్ బంగ్లాదేశ్ - Gqeberha 2022(టెస్ట్ మ్యాచ్)
మ్యాట్ పార్కింగ్ సన్ వర్సెస్ న్యూజిలాండ్ - లార్డ్ 2022 (టెస్ట్)
కమ్రన్ ఘూలామ్ వర్సెస్ న్యూజిలాండ్ - కరాచీ 2023 (వన్డే)
బహీర్ షా వర్సెస్ బంగ్లాదేశ్ - మిర్పూర్ 2023 (టెస్ట్)
హర్షిత్ రాణా వర్సెస్ ఇంగ్లాండ్ - పుణె 2025 (టీ20 మ్యాచ్ )
విజయంలో కీలక పాత్ర
ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో టీ20 శివమ్ దూబె బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కంకషన్‌కు గురయ్యాడు. దీంతో మ్యాచ్ రిఫరీ నిర్ణయం మేరకు దుబె స్థానంలో హర్షిత్ బౌలింగ్‌కు దిగాడు. ఇంగ్లాండ్ పై మూడు వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.