Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Harshal Patel: ఆ టైంలో వాళ్లిచ్చిన మద్దతు ఎంతో విలువైనది.. చోటు ఉంటుందో ఉండదో అనే ఒత్తిడి పోయింది

Harshal Patel Thanking Rahul Dravid and Captain Rohit for Their support for His Comeback

భారత పేసర్ హర్షల్ పటేల్ గాయం నుంచి కోలుకుని తిరిగి ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నిమిత్తం తిరిగి భారత జట్టుకు వచ్చిన సంగతి తెలిసిందే. గాయం కారణంగా ఆసియా కప్ జట్టులో హర్షల్ పటేల్ ఆడలేకపోయాడు. ఇకపోతే ఇప్పటికే మొహాలీకి చేరుకుని ప్రాక్టీస్ మొదలెట్టిన హర్షల్ పటేల్.. ఈ సిరీస్‌కు ముందు ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోతో మాట్లాడాడు. ఇక గాయంతో జట్టుకు దూరమైనప్పుడు కెప్టెన్, కోచ్ నుంచి తనకు లభించిన పూర్తి మద్దతు పట్ల తాను ఎంత కృతజ్ఞతతో ఉన్నానని తెలిపాడు. సెప్టెంబరు 20న మొహాలీలో జరిగే తొలి టీ20మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. హర్షల్ పటేల్ ఈ మ్యాచ్‌లో పాల్గొనే అవకాశం ఉంది.

'తిరిగి జట్టులోకి వచ్చే విషయంలో భారత కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ మద్దతు ఇవ్వడం నాకు ఎంతో మేలు చేసింది. ఎంపిక అవుతామో కామో అనే ఒత్తిడిని తగ్గించింది. ఎందుకంటే తిరిగి జట్టుకు ఎంపికయినప్పుడు.. మనకు తెలియకుండానే కొంత ఎక్కువగా రాణించాలి.. ఎక్కువగా కష్టపడాలి.. ఎలాగైనా మునుపటిలాగా వెంటనే ఫామ్ పుంజుకోవాలనే విపరీత ఒత్తిడిని భుజాన వేసుకుంటాం. లేకపోతే జట్టులో స్థానం ఉంటుందో ఉండదో అనే భయం కూడా ఉంటుంది. కానీ ఆ భయాలేమీ లేకుండా స్వేచ్ఛగా ఆడేలా కోచ్, కెప్టెన్ మద్దతునిచ్చారు.' అని హర్షల్ పటేల్ తెలిపాడు.

సదరు జ్ఞాపకాలను తుడిచిపెట్టేసేలా

సదరు జ్ఞాపకాలను తుడిచిపెట్టేసేలా

భారత జట్టులోని ప్లేయర్లు గాయాల కారణంగా దూరమయ్యి కొన్ని సిరీస్లకు మిస్సయిన సంగతి తెలిసిందే. అందువల్ల జట్టు కూర్పు విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. ఇప్పుడు ఆస్ట్రేలియాపై భారత్ తమ పూర్తి బలాన్ని చాటుకోవాలని భావిస్తోంది. ప్రపంచకప్‌ టోర్నీకి ముందు జట్టు సామర్థ్యాన్ని పూర్తిగా పట్టుకోవాలని చూస్తుంది. 2021ఎడిషన్‌లో గ్రూప్ దశలోనే టీమిండియా నిష్క్రమించిన సంగతి తెలిసిందే. సదరు జ్ఞాపకాలను తుడిచిపెట్టేసేలా కొత్త ప్రణాళికలతో జట్టు ముందుకు వెళ్లాల్సిన అవసరముంది.

టీం మేనేజ్‌మెంట్ గుర్తుంచుకుంటుంది

టీం మేనేజ్‌మెంట్ గుర్తుంచుకుంటుంది

'గాయపడటానికి ముందు మీరు ఏం చేశారనే విషయాన్ని టీం మేనేజ్‌మెంట్ గుర్తుంచుకుంటుంది. మీ ప్రదర్శనలు, జట్టుకు మీరిచ్చిన సహకారాన్ని జట్టు మరచిపోలేదని మీకు తెలిస్తే.. అది మీకు నిజంగా మంచి ప్రశాంతతను ఓదార్పును ఇస్తుంది. అలాంటప్పుడు జట్టుకు నిస్సందేహంగా మీరు మళ్లీ మంచి ప్రదర్శన ఇవ్వడానికి చాలా మంచి స్కోప్ ఉంటుంది. ఇది ప్రతి ఒక్క క్రికెటర్‌కు వర్తిస్తుంది. మీరు జట్టులో ఓ విలువైన స్థానాన్ని కలిగి ఉంటారనే ఫీలింగ్ మనకొస్తుంది.' అని హర్షల్ చెప్పాడు.

ఆస్ట్రేలియాతో సిరీస్లో బరిలోకి దిగే భారత జట్టు:

ఆస్ట్రేలియాతో సిరీస్లో బరిలోకి దిగే భారత జట్టు:

టాపార్డర్ : రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ,

మిడిలార్డర్ : సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్),

ఫినిషర్లు : దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా,

స్పిన్నర్లు : ఆర్.అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్,

పేసర్లు : భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా

Story first published: Monday, September 19, 2022, 9:26 [IST]
Other articles published on Sep 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+