Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హర్షాభోగ్లే సంచలన వ్యాఖ్యలు.. చదువుకున్న ఆ మూర్ఖుల వల్లే దేశంలో కరోనా వ్యాపిస్తోంది!!

Harsha Bhogle slams people for being careless amid Coronavirus outbreak

ముంబై: మహమ్మారి కరోనా వైరస్‌ (కోవిడ్-19) ధాటికి ప్రపంచం మొత్తం నిలిచిపోయింది. అంతర్జాతీయ సరిహద్దుల నుండి పాఠశాలలు, కళాశాలలు, మాల్స్, జిమ్‌లు, క్రీడా కార్యక్రమాలు.. ఇలా విమానాశ్రయాల వరకు మూసివేయబడ్డాయి. గతంలో కాకుండా ఇప్పుడు చదువుకున్న వారి నిర్లక్ష్యం కారణంగానే వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లక్షలాది మంది క్రమశిక్షణతో వ్యవహరిస్తుంటే, కొందరు మూర్ఖంగా ప్రవర్తిస్తూ వైరస్‌ని విస్తరిస్తున్నారని క్రికెట్ వ్యాఖ్యాత హర్షాభోగ్లే మండిపడ్డాడు.

 అలాంటి స్టుపిడ్స్ వల్లే:

అలాంటి స్టుపిడ్స్ వల్లే:

కరోనా వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారు కనీసం 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినప్పటికీ.. కొంత మంది ప్రముఖులు మూర్ఖంగా ప్రవర్తిస్తూ జన సందోహంలో కలిసిపోతున్నారని హర్షాభోగ్లే ఆగ్రహం వ్యక్తం చేసారు. పరోక్షంగా బాలీవుడ్ గాయని కనిక కపూర్‌ని ఉద్దేశిస్తూ పై వ్యాఖ్యలు చేసాడు. 'కొంత మంది మూర్ఖుల తీరు చూస్తుంటే నిరాశ కలుగుతోంది. చదువుకున్న వారు అయి ఉండి కూడా.. కరోనా కేసులు ఉన్న దేశాల నుంచి వచ్చి పార్టీలంటూ తిరుగుతుండటం బాధాకరం. దేశంలో కొన్ని లక్షల మంది కరోనాపై పోరాడుతున్నారు. కానీ కొద్ది మంది ఆ పోరాటాన్ని నీరుగారుస్తున్నారు. మనం సమాజంలో ఉన్నామనే విషయాన్ని గుర్తించుకోవాలి' అని ఫైర్ అయ్యాడు.

ఇంగ్లాండ్‌ నుంచి భారత్‌కి:

ఇంగ్లాండ్‌ నుంచి భారత్‌కి:

బాలీవుడ్‌ ప్రముఖ సింగర్‌ కనికా కపూర్‌ 10 రోజుల క్రితం ఇంగ్లాండ్‌ పర్యటన నుంచి భారత్‌కి వచ్చింది. 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండకుండా.. ముంబైలో ఓ మూడు పార్టీలకి హాజరైంది. కనికా కపూర్‌ ఓ పార్టీలో రాజస్తాన్‌ మాజీ సీఎం వసుంధరా రాజే, ఆమె కుమారుడు దుష్యంత్‌ సింగ్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లండన్‌ నుంచి వచ్చిన కనికాకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. ఆమెతో పాటు వీరిద్దరు, వీరిని కలిసిన మరికొందరు ప్రముఖులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

కనికాపై ఎఫ్‌ఐఆర్‌:

కనికాపై ఎఫ్‌ఐఆర్‌:

కరోనా వ్యాప్తి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కనికా కపూర్‌పై పోలీసు కేసు నమోదైంది. విదేశాల నుంచి తిరిగి వచ్చి.. కరోనా వైరస్‌ విషయంలో ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి, నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించినందుకు ఆమెపై సరోజినీ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. లఖ్‌నవూ చీఫ్‌ మెడికల్ ఆఫీసర్‌ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఆమెపై ఆయా పోలీస్‌ స్టేషన్ల పరిధిలో మరో మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యే అవకాశాలున్నాయి.

కరోనా ఉందని ముందు తెలియదు:

కరోనా ఉందని ముందు తెలియదు:

తనకు కరోనా ఉందని ముందు తెలియదని.. నిర్ధారణ అనంతరం తాను, తమ కుటుంబసభ్యులు స్వీయనిర్బంధంలోనే ఉన్నామని కనికా కపూర్‌ వివరణ ఇచ్చింది. తాను గ్లౌవ్స్ వేసుకుని పార్టీలకు హాజరైనట్లు కూడా చెప్పింది. క్వారంటైన్‌ అంటే అది కాదంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మహారాష్ట్రలోనే ఎక్కువగా నమోదవడం విశేషం.

Story first published: Saturday, March 21, 2020, 21:09 [IST]
Other articles published on Mar 21, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+