Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్‌.. దక్షిణాఫ్రికా కెప్టెన్‌కు హర్షాభోగ్లే అదిరే పంచ్!!

Harsha Bhogle reacts to van Niekerk’s free pass to final remark

సిడ్నీ: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ తుదిపోరుకు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో గురువారం జరగాల్సిన తొలి సెమీఫైనల్ మ్యాచ్ వర్షంతో రద్దవ్వడంతో గ్రూప్-ఎ టాపర్‌గా ఉన్న హర్మన్‌ప్రీత్ సేన నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించింది. మరో సెమీస్ మ్యాచ్‌లో గురువారం ఆస్ట్రేలియాతో తలపడిన దక్షిణాఫ్రికా డక్‌వర్త్‌లూయిస్‌ పద్ధతిలో 5 పరుగులతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఫ్రీ పాస్‌తో ఫైనల్ చేరడం కంటే:

ఫ్రీ పాస్‌తో ఫైనల్ చేరడం కంటే:

సెమీస్ మ్యాచ్‌ అనంతరం దక్షిణాఫ్రికా మహిళా కెప్టెన్‌ డేన్‌ వాన్‌ నీకెర్క్‌ మాట్లాడుతూ.. భారత్‌ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించింది. సెమీస్ మ్యాచ్ ఆడకుండా ఫ్రీ పాస్‌తో ఫైనల్ చేరడం కంటే.. ఓడిపోవడమే ఉత్తమమని దక్షిణాఫ్రికా కెప్టెన్ అభిప్రాయపడింది. తన వ్యాఖ్యలతో పరోక్షంగా భారత జట్టు ఫైనల్ చేరడాన్ని సఫారీ కెప్టెన్ తప్పుబట్టింది. ఈ వ్యాఖ్యలతో భారత అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు.

ఫైనల్‌కు చేరడం ఫ్రీ పాస్‌ కాదు:

దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డేన్‌ వాన్‌ వ్యాఖ్యలకు ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే ట్విటర్‌లో దీటుగా స్పందిస్తూ.. అదిరే పంచ్ ఇచ్చారు. వర్షం వల్ల ప్రభావితమైన సెమీఫైనల్‌లో ఆడాలా వద్దా అనేది ఆమె చేతుల్లో లేదన్నారు. 'వర్ష ప్రభావిత మ్యాచ్ ఆడాలా వద్దా అనేది మీ ఎంపిక కాదు. టీమిండియా ఫైనల్‌కు చేరడం నిజంగా ఫ్రీ పాస్‌ కాదు. గ్రూప్‌ దశలో అద్భుతంగా రాణించినందుకు హర్మన్‌ప్రీత్‌ సేనను దక్కిన గౌరవం' అని హర్షా భోగ్లే రాసుకొచ్చారు.

వర్షంతో మ్యాచ్ రద్దు:

వర్షంతో మ్యాచ్ రద్దు:

భారత జట్టు గ్రూప్‌ దశలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను తన తొలి మ్యాచ్‌లోనే ఓడించి టోర్నీని ఘనంగా ఆరంభించింది. ఆ తర్వాత వరుసగా బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌, శ్రీలంకలపై అద్భుత విజయాలు సాధించి గ్రూప్‌-ఎలో 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ఇంగ్లాండ్‌ గ్రూప్‌-బిలో ఆరు పాయింట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ రెండు జట్లు తొలి సెమీస్‌లో తలపడాల్సి ఉండగా.. మ్యాచ్‌ రద్దైపోయి భారత్‌ ఫైనల్ చేరింది.

రిజర్వ్‌డే ఉండాలి:

రిజర్వ్‌డే ఉండాలి:

ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు ఐసీసీ రిజర్వ్‌డేని కేటాయించిన నేపథ్యంలో నాకౌట్లకు కూడా కేటాయించాలని అంతకుముందు పలువురు క్రికెటర్లు విజ్ఞప్తి చేశారు. 'వాతావారణ పరిస్థితుల వల్ల ఓడిపోవడం భావ్యం కాదు. ఇలా ఉండాలని మాత్రం నేను కోరుకోను. భవిష్యత్తులో ఫైనల్, సెమీఫైనల్స్‌కు రిజర్వ్ డే కేటాయిస్తారని విశ్వసిస్తున్నా' అని డేన్ వాన్ పేర్కొంది.

Story first published: Saturday, March 7, 2020, 14:52 [IST]
Other articles published on Mar 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+