Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 వరల్డ్ కప్‌కు హార్దిక్‌ ఎందుకు? - హర్షా భోగ్లే

మరో నెలన్నర రోజుల్లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగాటోర్నీకి యుఎస్‌ఏ, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. దాదాపు అన్ని దేశాలు ఇప్పటికే జట్టు కూర్పు గురించి ఓ క్లారిటీకి వచ్చాయి. మరోవైపు ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా భారత జట్టును ప్రకటించాలని టీమిండియా సెలక్టర్లు భావిస్తున్నారు. అయితే ఈ క్రమంలో స్టార్ ఆల్‌రౌండర్ హార్టిక్ పాండ్య గురించి ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే కీలకవ్యాఖ్యలు చేశాడు.

టీ20 వరల్డ్ కప్‌కు హార్దిక్ ఎంపిక అవ్వడం కష్టమే అని హర్షా భోగ్లే అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం హార్దిక్ సంపూర్ణ ఆల్‌రౌండర్‌గా కొనసాగకపోవడమే దానికి కారణమని వివరించాడు. వన్డే వరల్డ్ కప్ అనంతరం ఐపీఎల్‌తో తిరిగి రీఎంట్రీ ఇచ్చిన హార్దిక్ బౌలింగ్ పూర్తి సామర్థ్యంతో చేయట్లేదని, బ్యాటింగ్‌లోనూ మునపటిలా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడట్లేదని హర్షా భోగ్లే గుర్తుచేశాడు. టీమిండియాలో బ్యాటర్ల మధ్య నెలకొన్న పోటీతో హార్దిక్ ప్రపంచకప్‌కు ఎంపికవ్వడం కష్టతరమే అని తెలిపాడు.

Harsha Bhogle Questions How Will Hardik Be Selected for T20 World Cup

''హార్దిక్ పాండ్య బౌలింగ్ చేయలేకపోతే టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు ఎంపిక అవుతాడా? అతడు బౌలింగ్ చేయకుండా టీమిండియా టాప్-6 బ్యాటర్లలో స్థానం సంపాదించుకోగలడా? నేను దానికి అంగీకరించలేను. ఎందుకంటే అతను పవర్‌ఫుల్‌గా బ్యాటింగ్ చేయట్లేదు. పైగా బౌలింగ్‌ కూడా చేయకపోతే, అతడు బ్యాటుతో కచ్చితంగా సత్తాచాటాలి. జట్టులో తీవ్రపోటీ ఉంది'' అని హర్షా భోగ్లే తెలిపాడు.

వన్డే ప్రపంచకప్‌లో గాయపడిన హార్దిక్ కోలుకుని ఐపీఎల్‌తో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య మొదటి ఓవర్ బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పవర్‌ప్లేలోనే బంతిని అందుకున్నాడు. కానీ తర్వాత రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ బౌలింగ్‌కు రాలేదు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఓ ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. మొత్తంగా బౌలింగ్ విభాగంలో విఫలమయ్యాడు. అలాగే ఆర్సీబీ మ్యాచ్ మినహా బ్యాటింగ్‌లోనూ హార్దిక్ ఆకట్టులకోలేకపోయాడు.

Story first published: Sunday, April 14, 2024, 12:33 [IST]
Other articles published on Apr 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+