INDvsNZ: 'డబ్ల్యూటీసీ ఫైనల్‌లో దినేష్ కార్తీక్ అదరగొట్టాడు.. నేను ఫిదా అయ్యా'

సౌథాంప్టన్: ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఎట్టకేలకు శనివారం మొదలైంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఈ మెగా పోరులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (34; 68 బంతుల్లో 6x4), శుభ్‌మన్ గిల్ (28; 64 బంతుల్లో 3x4).. టెస్ట్ స్పెసలిస్ట్ చెతేశ్వర్ పుజారా (8; 54 బంతుల్లో 2x4) నిరాశపరిచారు. 88 పరుగులకే ప్రధాన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఆదుకునే ప్రయత్నంలో ఉన్నారు.
కామెంటేటర్‌గా కార్తీక్:
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు భారత దిగ్గజం సునీల్ గవాస్కర్‌తో పాటు టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ట్విటర్ వేదికగా ఈరోజు ఉదయం నుంచి మ్యాచ్ అప్‌డేట్స్, సౌథాంప్టన్ వాతావరణ పరిస్థితులను కార్తీక్ అభిమానులకు తెలియజేశాడు. ఇక మ్యాచ్ ప్రారంభమైన తర్వాత తనదైన వ్యాఖ్యానంతో అభిమానులను అలరించాడు. తనదైన సమయస్పూర్తితో సహచర కామెంటేటర్లపై పంచ్‌లు వేస్తూ.. చలోక్తులు పేల్చుతూ దూసుకుపోతున్నాడు. వ్యాఖ్యానం చేయడం ఇదే మొదటిసారి అయినా.. ఎక్కడా తబడలేదు.

ఫిదా అయ్యా:
దినేశ్ కార్తీక్ కామెంట్రీ పట్ల ఫాన్స్ ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా అతడి వ్యాఖ్యానంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కార్తీక్ కామెంటేటర్‌గా దుమ్మురేపుతున్నాడని ఓ అభిమాని కామెంట్ చేయగా.. భారత తరఫున దినేశ్ కార్తీక్ కామెంటరీ బాక్స్‌లో ఆకట్టుకుంటున్నాడని మరో అభిమాని ట్వీట్ చేశాడు. డీకే వ్యాఖ్యనంకు అభిమానులే కాదు.. కామెంటేటర్‌లు కూడా ఫిదా అయ్యారు. భారత ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లే.. కార్తీక్ కామెంటరీపై స్పందించాడు. 'దినేష్ కార్తీక్ తొలిసారి వ్యాఖ్యానం చేసినా.. చాలా బాగుంది. నేను ఫిదా అయ్యా' అని ట్వీట్ చేశాడు. మొత్తానికి డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కార్తీక్ అదరగొట్టాడు. వ్యాఖ్యాన బృందంలో భారత్ నుంచి సన్నీ, డీకేలకే చోటు దక్కింది.

క్రికెట్‌లోనే ఎందుకు భిన్నం:
'ఫుట్‌బాల్ మరియు ఎన్‌బిఏలను ఓసారి చూస్తే.. ప్రస్తుత ఆటగాళ్లు గాయపడినప్పుడు లేదా వారికి జట్టులో చోటు దక్కనప్పుడు వ్యాఖ్యానం చేస్తారు. భారత దేశంలో అలా కాదు. వ్యాఖ్యాతగా వెళితే.. ఆ అతగాడి కెరీర్ ఇక పూర్తయింది అని అనుకుంటారు. ఫుట్‌బాల్ ఆటలో ప్రస్తుత ఆటగాళ్లు స్టూడియోలో కూర్చుని మాట్లాడతారు. ఎన్‌బిఏ మరియు టెన్నిస్‌లో కూడా ఇదే జరుగుతుంది. క్రికెట్‌లో మాత్రం ఇది ఎందుకు భిన్నంగా ఉండాలి?' అని దినేశ్ కార్తీక్ ఫైనల్ ముందు ప్రశ్నించాడు. కార్తీక్ భారత్ తరఫున 26 టెస్టులు, 94 వన్డేలు, 32 టీ20లు ఆడాడు. ఇక 203 ఐపీఎల్ మ్యాచులను ఆడాడు.

50 ఓవర్లలో 106 పరుగులు:
కివీస్‌తో జరుగుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో కోహ్లీసేన మూడో వికెట్ కోల్పోయింది. 88 పరుగుల వద్ద చతేశ్వర్ పుజారా వికెట్ల ముందు దొరికిపోయాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఇన్ స్వింగర్‌కు కంగారుపడిన పుజారా.. ఎల్బీగా వెనుదిరిగాడు. 54 బంతులు ఎదుర్కొన్న పుజారా.. రెండు ఫోర్ల సాయంతో 8 పరుగులు మాత్రమే చేశాడు. ప్రస్తుతం కెప్టెన్ విరాట్ కోహ్లీ 27, అజింక్య రహానే 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications