దేశం విడిచి వెళ్లిపో: అభిమాని పట్ల కోహ్లీ వ్యాఖ్యలను తప్పుబట్టిన భోగ్లే


హైదరాబాద్: ఓ అభిమాని పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మండిపడ్డాడు ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే. అభిమాని పట్ల విరాట్ కోహ్లీ స్పందించిన తీరు సరిగా లేదని భోగ్లే అభిప్రాయపడ్డాడు. చాలా మంది ప్రముఖులు పడిపోయే బుడగలోనే కెప్టెన్ కోహ్లీ కూడా పడ్డాడని భోగ్లే అన్నాడు.

కోహ్లీలాంటి సెలబ్రిటీలు ఇలాంటి బుడగలు ఏర్పడకుండా చూసుకోవాలి
కోహ్లీలాంటి సెలబ్రిటీలు ఇలాంటి బుడగలు ఏర్పడకుండా చూసుకోవాలని హర్షా భోగ్లే సూచించాడు. నవంబర్ 5 విరాట్ కోహ్లీ 30వ పుట్టినరోజుని జరుపుకున్నాడు. ఈ సందర్భంగా కోహ్లీ తన పేరిట ఓ యాప్‌ను ప్రారంభించాడు. అనంతరం అభిమానులతో కోహ్లీ కాసేపు చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా కోహ్లీ చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు వివాదాస్పదమైంది.
కోహ్లీని ఓవర్‌రేటెడ్ ప్లేయర్ అన్న ఓ అభిమాని
ఓ క్రికెట్ అభిమాని విరాట్ కోహ్లీని ‘‘ఓవర్‌రేటెడ్ ప్లేయర్'' అని పేర్కొన్నాడు. ‘‘విరాట్ కోహ్లీ ఓ ఓవర్‌రేటెడ్ బ్యాట్స్‌మెన్. అతనిలో నాకు ఏదీ ప్రత్యేకంగా కనిపించదు. ఇండియా వాళ్ల కంటే ఇంగ్లీష్, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ల బ్యాటింగ్ నాకు ఎంతో నచ్చుతుంది'' అని పేర్కొన్నాడు. దీనిపై విరాట్ కోహ్లీ తీవ్రంగా స్పందించాడు.
నువ్వు భారత్‌లో ఉండాల్సిన వాడివి కాదు
కోహ్లీ సమాధానమిస్తూ ‘‘నువ్వు భారత్‌లో ఉండాల్సిన వాడివి కాదు. ఎక్కడికైనా వెళ్లి బతుకు. ఇంగ్లండ్ లేదా ఆస్ట్రేలియాలు మాత్రమే నీకు సరైనవి. దేశం విడిచి వెళ్లిపో. వేరే దేశాలను ప్రేమిస్తూ.. ఇక్కడ ఎందుకు ఉండటం. నీవు నన్ను అభిమానించ మాత్రాన నాకేం కాదు. నీకు ఈ దేశం సరైంది కాదు. కానీ ఇక్కడ ఉంటూ వేరే దేశాన్ని పొగడటం నాకు ఇష్టం ఉండదు'' అని అన్నాడు.
కోహ్లీ వ్యాఖ్యలను తప్పుబట్టిన హర్షా భోగ్లే
అయితే, కోహ్లీ ఇంత తీవ్రంగా స్పందించడాన్ని హర్షా భోగ్లే తప్పుబట్టాడు. "చాలా మంది ప్రముఖులు తమకు నచ్చే విషయాలే వినాలన్న ఓ రకమైన బుడగను తమ చుట్టూ ఏర్పర్చుకుంటారు. ఇది మంచిది కాదు. ఇదే భిన్నాభిప్రాయాలకు దారి తీస్తుంది" అని భోగ్లే తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications