Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లాండ్ మీడియాను కడిగిపారేసిన హర్షా భోగ్లే.. బ్రిటీష్ వాళ్లు ఏదీ చెబితే అది పాటించాల్సిన పని లేదు

Harsha Bhogle condemns England medias zeal to blame Deepti Sharma.

ప్రముఖ భారత క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే.. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇటీవల ఛార్లీ డీన్‌ను నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో రన్ అవుట్ చేసినందుకు దీప్తి శర్మపై ఇంగ్లాండ్ మీడియా చేస్తున్న రాద్ధాంతాన్ని కడిగిపారేశాడు. బ్రిటీష్ మీడియా అత్యుత్సాహాన్ని, సంకుచిత సంస్కృతిని ఎండగట్టాడు. తమదే కరెక్ట్ అనే బ్రిటీష్ కారుకూతలపై విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో ఛార్లీ డీన్ కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఇంగ్లాండ్ మరో 17పరుగులు చేసే విజయం సాధిస్తుంది. అయితే కేవలం చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది. అయితే ఈ తరుణంలో నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో పదే పదే బంతి విసరకముందే క్రీజు వీడుతున్న ఛార్లీ డీన్ అత్యుత్సాహాన్ని గమనించిన దీప్తి మన్కడింగ్ పద్ధతిలో ఆమెను ఔట్ చేసింది. దీంతో ఇండియా గెలిచింది.

మీ ప్లేయర్ తప్పును కప్పేస్తారా?

మీ ప్లేయర్ తప్పును కప్పేస్తారా?

ఇక ఈ విషయమై హర్మన్ ప్రీత్ కౌర్ స్పందిస్తూ.. తాము పదే పదే హెచ్చరించామని, కానీ ఛార్లీ డీన్ క్రీజు వదలడం మాత్రం మానలేదని పేర్కొంది. అయితే ఇంగ్లాండ్ కెప్టెన్ హీథర్ నైట్ మాత్రం ఔట్ ఎలాగూ చేశారు. సరే కానీ హెచ్చరించినట్లు ఎందుకు అబద్ధాలు చెప్పడం అంటూ ఘాటుగా స్పందించింది. ఇక ఈ విషయమై ఇంగ్లాండ్ మాజీ, ప్రస్తుత ప్లేయర్లు చేస్తున్న కామెంట్లు, మీడియా చేస్తున్న హడావిడి మీద హర్ష భోగ్లే సీరియస్ అయ్యాడు. దీప్తి క్రికెట్ చట్టాల ప్రకారం ఆడిందని.. ఆమె మీద ఎలాంటి విమర్శలు చేయడం సరికాదని, ఇంగ్లాండ్ మీడియా మీ ప్లేయర్ తప్పును కప్పేసి.. దీప్తిని దోషిగా నిలబెట్టే పని చేయడం అంటూ మండిపడ్డాడు. క్రీజు దాటుతూ ఇల్లీగల్ ప్రయోజనాన్ని పొందడం కోసం ప్రయత్నించిన ఛార్లీ డీన్‌ను ముందు ప్రశ్నించుకోండంటూ కడిగిపారేశాడు.

ఇంగ్లాండ్ ఏది చెబితే అదే అనే ధోరణి పోవాలి

ఇంగ్లాండ్ ఏది చెబితే అదే అనే ధోరణి పోవాలి

'ఇంగ్లాండ్‌లోని మీడియా ఎంత స్వార్థపూరితమైందో అర్థమవుతుంది. క్రీజు నుంచి పదే పదే బయటకు వస్తున్న తమ ప్లేయర్ అపరాధి అని పేర్కొనకుండా.. చట్ట ప్రకారం నడుచుకున్న మా ప్లేయర్ మీద అభాండాలు మోపుతుంది. ఈ మీడియా తీరు నన్ను విస్మయానికి గురిచేస్తోంది. క్రికెట్ ఆడే దేశాలను వారు పాలించినందున.. క్రికెట్లో వాళ్లు చెప్పిందే రైట్, రాంగ్ అని పడిపోయాయి. తత్ఫలితంగా ఇంగ్లాండ్ ఏదీ తప్పంటే అది తప్పనే విషయాన్ని క్రికెట్ ప్రపంచం ఇప్పటికీ పరిగణిస్తూనే ఉంది. ఆ మనస్తత్వాన్ని బద్ధలు కొట్టాలి. ప్రపంచంలోని మిగతా క్రికెట్ దేశాల జట్లు ఇంగ్లాండ్‌లా ఆలోచించాల్సిన అవసరం లేదు. చట్టాల ప్రకారం స్పష్టంగా ఏది తప్పో దాన్ని పాటిస్తే చాలు' అని హర్ష భోగ్లే అన్నాడు.

చట్టంలో క్లియర్ కట్‌గా ఉంది

చట్టంలో క్లియర్ కట్‌గా ఉంది

'ఈ ఇంగ్లాండ్ వాళ్లు తాము తప్పుగా భావించే చట్టాన్ని.. మిగతా జట్లు కూడా ఆలోచించేలా చేశారు. అయితే క్రికెట్ చట్టాలు రూపొందించేటప్పుడు మాత్రం ఇలాంటి వాటిని వాళ్లు ఎందుకు అడ్డుచెప్పారో మాత్రం తెలియదు. శతాబ్దాలుగా క్రికెట్లో కొనసాగుతున్న ఇంగ్లాండ్ పెత్తనాన్ని ఆపేసి.. మిగతా జట్లను క్రికెట్ రూల్స్ ప్రకారం ఆడాలని మేల్కొల్పడం చాలా కష్టం. చట్టంలో క్లియర్ కట్‌గా ఏముందంటే.. బౌలర్ చేయి ఎత్తులో ఉండే వరకు నాన్ స్ట్రైకర్ తప్పనిసరిగా క్రీజు వెనకాలే ఉండాలి.' అని హర్ష భోగ్లే లా పాయింట్‌తో కొట్టాడు.

Story first published: Friday, September 30, 2022, 19:45 [IST]
Other articles published on Sep 30, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+